Subscribe RSS



చినుకు జ్ఞాపకం 


వాన అనగానే అందరికి చిన్నఫ్ఫుడు వానా వానా వల్లప్ప అని తిరిగిన లేత చినుకుల నవ్వులో ... లేక యుక్త వయసు లోని చిలిపితనాల చిందులు తొక్కించిన చినుకుల చిట పటలో , ఇంకా ముందుకు వస్తే శ్రీవారి/శ్రీమతి తో కలిసి ఆషాడానికి ముందు వెనుకలు గా సాగిన పరవళ్ళు తొక్కే చినుకుల సరాగాలు గుర్తు వస్తాయి. ఆ పైన భాద్యతల వరదలో మునిగి తేలుతూ, మళ్ళీ మునకలేస్తూ.... చినుకెప్పుడొచ్చిందో... పోయిందో తెలియని హడావుడి లో కూడా, ఇంటి ముంగిటకొచ్చి నన్ను పట్టించుకోవే అని చిందులు తొక్కిన, గారాల వయ్యారాల వాన పలుకుల జ్నాపకమొకటి మీతో పంచుకుంటూ...  


వర్షాకాలమంటూ ఒక ప్రత్యేక కాలమే లేని దేశం లో, ఈ కాలం ఆ కాలం అని లేకుండా.... ఏ కాలమైనా అకాలం గా వూడి పడగల ఏకైక అతిధి మాకు ఈ వాన జల్లే కదా.. జల్లంటే జల్లూ కాదు విరి జల్లు కాని, విరులంటే విరులూ కాదూ వరదల్లే కాని అని పాడుకోవటమే మాకు వాన వూసు వస్తే... వసంతమొచ్చిందో అని గుట్టలు పోసిన మంచు మీద పడ్డ వాన చినుకేగా, మొదటి సారి మరి మాకు వుప్పందించేది.  






ఆ కబురు కరిగిన నీరై, ఆ పైన మెరిసిన వాన చినుకుల తెల్లాటి మెరుపుల మురిసే లోపు, మేమొచ్చామో అని వాన చినుకు కు తోడు పూలు పైకొచ్చి పలకరిస్తాయి. ఇక పాడుకోవటం మొదలెడతాము కోటి ఆశలను గుండె నిండా నింపుకుని "April showers bring May flowers "  అని, ఇంకా మా కోసమని విరబూయ బోయే వనాల వరదలను తలచుకుంటూ... ఆ పైన మురుసుకుంటూ...


ఇక చూడు ఆ చినుకమ్మ విన్యాసాలు,  ఎన్ని కబుర్లను మోసుకొని తెస్తుందనుకుంటున్నారు. ఇదుగో దూర దేశానికి నిరుడు తరలి పోయిన ఆ పెద్ద డేగ లొస్తున్నాయి జాగర్త... ఇక్కడే కదా అని ఆలస్యం గా గూటికి చేరుకోకు అని చిన్ని గువ్వ పిట్ట కు రెక్క నిమురుతూ ఒక చినుకు... 




తన పిల్లలను పొదగటానికి ఎక్కడ నుంచో ఎగిరి మా అడవులకు రానున్న ఎర్ర కళ్ళ బుల్లి పిట్టలకు గూడు మెత్త గా వుందో లేదో అని ఆకు ఆకుని బతిమాలి గాలితో కలిపి తడిపి పక్క చేస్తున్న ఒక చినుకు.... వసంతమంతా మా ముంగిట పోయటానికి ముందటేడూ మిగిలిన ఆకుల అవశేషాలను వూడ్చి కళ్ళపి జల్లి పోతూ ఎన్నెన్ని చినుకులు పలకరిస్తాయనుకుంటున్నారు. సరి ఆ వసంత వీర భోగం అవుతుందా..




పూలతో సొమ్మసిల్లి ఎండలకు తేరుకుంటూ... ఎండాకాలం మాకు పంటల కాలం అని పాటలు పాడుకుంటూ...... ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపుసొలుపేమున్నది అని కూని రాగాలు (గిట్టని వాళ్ళు ఖూనీ రాగాలనటం కద్దు)  తీసుకుంటూ పనులు చేసుకుంటున్న మమ్ములను .. ఎండలలో మేమెక్కడ మాడి పోతామో అని ఒక వారం ఎండలు మండేయా, వెంటనే నేనున్నానని ఒక గ్రీష్మ గానం,  ఎండల ఎర్ర దనాన్ని పల్లవి గా చేసి, వుడుకు పొగల తాళం వేసి ఆ పైన చినుకమ్మలు..... గబ గబా గుబ గుబా వచ్చి వూసులాడుతూ.... పాటలాడతాయి.  మా పెరళ్ళలో అమృత ధారలు కురిపించి శక్తి నిస్తాయి. ఇక అడవులను, దారిలోని చెట్లకు.... లాల పోసి లాలించే తల్లై పాడే చినుకు రాగం, సెలయేళ్ళ ధారలను జీవ ధారలతొ నింపే ఆ చినుకు మహిమ వర్ణించ నా తరమా... 

ఇలా ఇన్ని హొయలు పోయిన చినుకమ్మ ఆగుతుందా... సూరీడు కాసంత కనుమరుగవ్వటానికి తయారవుతూ.... రాత్రి ఏడు కల్లా అలసి పోయానోయ్ అని తన ఎరుపును చెట్టు కొమ్మల అంచున అద్ది, నును లేత చలి గాలి దుప్పటి కప్పుకుంటుంటే....... మరి నేను కూడా వెళ్ళాలోయ్ అని కన్నీరు మున్నీరు గా మా ముంగిట ధారలై నిలుస్తుంది. కొమ్మ కొమ్మ ను పువ్వు పువ్వు ను శెలవడిగి... మా అందరికి Happy Thanks giving, Merry Christmas ఆ పైన Happy new year అని చెపుతూ.... అప్పటికి వచ్చే విజయ దశమి కి చేమంతుల పూబంతులను పన్నీట జలకాలాడించి దుర్గమ్మకు పెట్టమని నిద్ర ఆలస్యం గా లేస్తానేమో అని మా కిటికి పైన ఈడ్చి కొట్టి మరి నిద్ర లేపుతుంది... ఇది మాత్రం చినుకమ్మ నాకొక్క దానికే ఇచ్చే ప్రత్యేక బంపర్ ఆఫర్.


ఇలా మా అందరితో ఎన్నెన్నో భావాల, అనుభవాల, అనురాగాలను పంచుకుంటూ...... మా మధ్యన నీటి తెర గా, ఆ అపైన పొగ మంచు తెర గా, చివరికి మంచు లా ఘనీభవించి.. మా శెలవడిగి, తెల్లటి చలి దుప్పటి కింద బొజ్జుని మరుసటి ఏడుకే నా పలకరింపు అని చెప్పి మాయమవుతుంది. ఇదండి మా వూరి వాన చినుకు చెప్పిన సద్దులు. బాగున్నాయా. ఒక జ్నాపకం అని చెప్పి ఎన్ని చెప్పానో చూసారా.. ఇందులో అన్నీ అందరికి తెలిసినవే ఐనా మంచి కబురు నలుగురితో మళ్ళీ మళ్ళీ పంచుకోమంటారు కదండి అందుకని ఇలా మీతో.  

37 comments to “చినుకు జ్ఞాపకం”

  1. నీ చినుకు జ్ఞాపకాలు నీ కవితలంత కమ్మగా ఉన్నాయి. తొలకరి చినుకంత చల్లగా ఉన్నాయి. పచ్చని అరిటాకు మీదనుంచి జారుతున్న చినుకుని కిటికీలోంచి చూస్తూ మింగుతున్న వెచ్చని కాఫీ ఉన్నాయి. కమ్మని వాసనని పంచుతూ వర్షం కల్గించే మైమరపులా హాయిగా తీయగా ఉన్నాయి.

  1. కబుర్ల జల్లులతో తడిసి ముద్దయిపోయాం.
    వర్షాకాలమంటూ ఒక ప్రత్యేక కాలమే లేని దేశం అది
    వర్షాకాలమేలేని ప్రత్యేక ప్రాంతం మాది.:(

  1. మీ ఊరి చినుకుల అల్లరీ, మీ భావుకతా, చాలా బాగున్నాయి. ఫోటోలు చాలా చాలా బాగున్నాయి.
    psmlakshmi

  1. Iam first... I think

  1. cadivaanu... baagundi. mallee cadivi aswaadincelaa vundi.

  1. ఇది చాలా అన్యాయం భావనా ,
    నేనేమో ఇక్కడ చినుకమ్మ కోసం ఎదురు చూస్తుంటే మీరేమో మీ దగ్గర ఇంత అందం గా కట్టేసుకున్నారా ?

  1. ఇవి మీరు తీసిన ఫొటోస్ ఆ ?లేక గూగుల్ సెర్చ్ లోవా?
    భావన గారి భావాలూ బావున్నాయి.ఇంతకీ మీరు అమెరికా లో ఎక్కడుంటారు?
    చెప్తే ఇబ్బంది అయితే వద్దు,చెప్తే మేము వచ్చేయములెండి ! హ్హ హ్హ హ్హ :-))))

  1. very nice.. Uma gaaroo..

  1. Beautiful post and Lovely pictures!

  1. ఫొటోలు, వాన ముచ్చట్లు ఒకదాని కొకటి పోటీ పడుతున్నంత బాగున్నాయి...

  1. ఫోటోలు బావున్నాయి. మీరు తీసినవి అయితే(నే) అభినందనలు :)

  1. @ సుజాత: అమ్మయ్య మా వూరి చినుకుల కబుర్లన్ని యధాతం గా చేరాయన్నమాట.:-)

    @ విజయ్ మోహన్ గారు: అకాల వర్షాలతో పంటచేల కు ఇబ్బంది పెట్టే ప్రాంతాల లిస్ట్ లో మీ వూరు లేదా ఐతే? పోనిలెండి కనీసం మా కబుర్ల జల్లు ల తో నైనా తడపగలిగేను. ధన్యవాదాలు నచ్చినందుకు.

    @ లక్ష్మి గారు: అమ్మయ్య మా వూరి చినుకులు ల సడి మీ వూరు దాకా వినిపించి మొత్తానికి మీరు ఇటు కేసి వచ్చారు. క్షేమమా. :-)

  1. @ కృష్ణ : మీరు కాదు ముందు ఈ సారి :-) ధన్యవాదాలు నచ్చినందుకు.

    @ మాల గారు: ఏమనుకుంటూన్నారు మరి. (కళ్ళెగరేస్తున్నా ఇప్పుడు), కొండల అంచులతో గుచ్చి మరి చినుకుల మాల లు వేసుకుని తిరుగుతుంది మా వూరు.

    @ సావిరహే గారు: ఫొటో లు ఏవి నా సొంతం కాదు గూగులమ్మ దయే. మేము అమెరికాలో నార్త్ ఈస్ట్ రీజియన్ లో బోస్టన్ అనే సిటీ కు ఒక 30 మైళ్ళ దూరం లో వుంటాము. బోస్టన్ సబర్బ్స్ (బోస్టన్ పరిసర ప్రాంతాలలోని పల్లెటూరి లో) అనుకోవొచ్చు. తప్పకుండా రండి. నాకేం అభ్యంతరం లేదు. :-)

  1. @ ప్రసీద: ధన్యవాదాలోయ్ నచ్చినందుకు :-)

    @ రవి గారు: థ్యాంక్స్ అండి మీకు నచ్చగలిగేలా రాసేను మీ అందరంత తెలుగు తెలియకుండానే. :-) ఫొటో లు దొంగిలించి తెచ్చినవి నా గొప్పతనమేం లేదు అందులో.

    @ శ్రీలలిత గారు: ధన్యవాదాలండి నచ్చినందుకు పదాలు ఒక క్రమం లో పెట్టి ఆ పైన ఫొటో లు గూగులమ్మ నడి తెచ్చి అతికించా. :-)

  1. @ శరత్ గారు: నా కంత దృశ్యం లేదండి అంత బాగా పోటోలు తీసేంత దృశ్యం. నే తీస్తే అన్ని సాగర సంగమాలే. :-) ఐతే అభినందనలు వాపసా. :-(

  1. భావనా, బ్లాగులు చూస్తూ వుంటానుగానీ కామెంట్లు ఎక్కువ రాయను. రొటీన్ గా బాగుంది అని రాసేంత ఆసక్తి లేదు. ప్రమదావనం స్పెషల్స్ కి మాత్రం అన్ని పోస్టులకీ నా అభిప్రాయాలు రాస్తున్నా.
    psmlakshmi

  1. As usual chaalaa baagunnaayi. intaku mundu raasina kaamenT meeku chaeralaedu.(ee Tapaa gurinchae)

  1. ఎన్ని రాగాలు పాడించారండి ఈ చినుకులతో. ఎప్పటికీ వర్షమే రావాలి, నేనందులోనే కలిసిపోవాలి అనిపిస్తోంది. ఎంతబాగా రాసారో.

  1. భావన గారూ!! చాలా బాగున్నాయండీ మీ భావాలు. మళ్లీ మళ్లీ అనుభవించాలి అనిపించేలా.. :)

  1. ఇస్స్ ఎలా మిస్ అయ్యా ఈ పోస్ట్ ..భావనా సూపరు... పోస్ట్ గురించి కాదు..అదెలాగూ సూపర్గానే ఉంటుంది అని తెలుసు..కాని ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి

  1. @ సునీత: ధన్యవాదాలు నచ్చినందుకు. అవునా ఇంతకు ముందటి కామెంటు మిస్ అయ్యానా ఐతే :-(

    @ జయ: ధన్యవాదాలు నచ్చినందుకు. అవును కదా... చినుకు రాలటం అనేది ఒక అనుభవం.ఆకాశం నుంచైనా, కంటి నుంచైనా, మనసు నుంచైనా ఆనందం గా ఐనా, బాధ గా ఐనా... అది పూర్తి గా అనుభవించటమే మనం ఇవ్వగల గౌరవం దానికి. :-)

    @ అప్పు గారు: ధన్యవాదాలు నచ్చినందుకు. ఈ భావనలు నాకొక్కదానికే కాదు గా మరి అందరివి, చినుకు పడ్డప్పుడల్లా అనుభవించేవే..

  1. @ నేస్తం: పిలవటానికి మనసుకు ఎంతో హాయి గా వుంటుంది మీ పేరు..ధన్యవాదాలు నచ్చినందుకు. వు ఫొటోస్ అన్ని అప్పు తెచ్చుకున్నవే, భావానికి అనుగుణం గా సర్దేను అంతే. :-)

  1. భావనా గారూ...

    బాగా వ్రాశారు. ఫొటోలు ఎక్స్‌లెంట్. ఎలా సంపాదిస్తారండి... ఇలాంటి అద్భుతమైన ఫొటోస్...!

  1. భావన గారూ..
    మీ చినుకు పూల వానలో మమ్మల్నీ తడిపేసారు! మీ చినుకమ్మతో పాటూ మేము కూడా మీ ఊరంతా విహరించేసి వచ్చినట్టు ఉంది. Excellent post and superb selection of photos! Thanks for the beautiful feel! :-)

  1. చెప్పడం మరిచాను. మీ బ్లాగ్ టెంప్లేట్ చాలా బాగుంది :-)

  1. ఇవాళ మీ పుట్టినరోజా, తెలిసింది......భావనాతరంగానికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు.

  1. ఇదన్యాయం, తొండి, నేనస్సలు ఒప్పుకోను.పేరు చూసి క్రిష్ణ ప్రియ గారనుకున్నాను. మీరనుకోలేదు.ఏమైనా

    Belated Birthday wishes to you!A very very happy birthday! ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ

  1. భావన గారు !ఆ చినుకుల్లో ...మీరు ఒక చినుకై...చినుకు చినుకు ..చిరు "కవితై " మా పై కురిసిన తొలకరి వాన లా ఉందండి మీ టపా !

  1. oka sundara padaala vindu udayanne

  1. భావన గారూ,
    చాలా అందం గా వర్ణించారు.. Very poetic. నెమ్మది గా రోజుకొక టపా చదువుతాను ఇంక..
    చాలా జెలస్ గా అనిపించింది ఎంత చక్కగా రాశారో అని

  1. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

  1. మీకెప్పుడోగానీ బ్లాగు జ్ఞాపకం రాదాండి. చినుకుల కాలం అయిపోయి చలికాలం వచ్చేసింది కదా.

  1. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

  1. దసరా శుభాకాంక్షలు .

  1. భావన గారూ !
    తుఫానులు కూడా తీరాలు దాటేస్తున్నాయి. చలి వచ్చేసింది. ఈ శిశిరంలోనైనా నైనా మంచి ముత్యాలు రాల్చండి.
    మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
    - శి. రా. రావు
    శిరాకదంబం

  1. భావన గారూ !
    అయిదు నెలలు గడిచిపోయాయి.
    మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

  1. మీకూ మీకుటుంబానికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు భావన గారు :-)