చిన్నప్పుడు కలిసి బడిలోకి పరుగెత్తిన ఆకతాయి కాలపు స్నేహాలు, వురకలు వేసే వయసు లో జీవితాల నుంచి దూసుకెళ్ళే స్నేహాలు, ప్రపంచం లో ప్రతి విషయాన్ని మనదైన..... మన కంటి తో నిర్వచనాలు నిర్ణయించె వయసు లో జీవితమే తనదనిపించే స్నేహాలు, ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనే వుత్సహం లో గమ్యం వైపు పరుగు మొదలెట్టినప్పుడు తోడు పరుగెత్తిన స్నేహాలు,
తనదైన జీవితం లో తనతో పాటు గా తోడు నిలిచి మది నిండే స్నేహాలు... ఎన్నని చెప్పినా ఎంతని చెప్పి నా ఇంకా అసంపుర్తి గా చెప్పటానికి మిగిలి... సంపూర్తి గా వున్నానంటు జీవితాంతం తోడుగా ఆకతాయి తనం నుంచి ఆఖరి మజిలి వరకు కలిసి వచ్చే స్నేహాలు....
స్నేహమా నీకిదే నా శత సహస్ర కోటి వదనాలు...
జీవితమంటే స్నేహమే అనే దిశ లో నాతో కలిపి అడుగేసి, స్నేహమంటే నిర్వంచించిన నా ప్రాణ హితులకు, స్నేహమంటే అవసరాలకు వాడుకోవటమే అనే నిర్వచనాన్ని పాటించి గుండెలో అనంత దుఖ సాగరాలను నిలిపిన స్నేహితులకు , జీవితపు ప్రతి మజిలి లో వచ్చి చేరి జీవిత కష్ట, క్లిష్ట సమయాలలో తమ స్నేహ హస్తం తో గట్టెకించిన ప్రియ నేస్తాలకు, చెమరించిన కన్నులలో చేమ ను..... నవ్వైతే పెదవితో, బాధ ఐతే గుండె తో పంచుకున్న మిత్రులకు, పరిచయమైన అతికొద్ది కాలంలోనే ఒక స్నేహ కుటుంబమైన బ్లాగ్లోకపు నేస్తాలందరికి ప్రపంచ స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు.
చెలిమి అనే అపురూప పరిమళం సదా మన జీవితాలలో నిండి వుండాలని, ప్రతి రోజు స్నేహోత్సవమై అనుక్షణమొకసంబరమై స్నేహ బంధాలు ిలబడాలని సదా కోరుకుంటున్నాను .
happy friendship day