ఇదేమిటిరా బాబు "సత్యమేవ జయతే" కదా ఇలా ఈ అమ్మాయి వక్ర భాష్యం చెపుతుందేమిటా అనుకుంటున్నారా? "సత్యమేవ జయతే" లోని నిబద్దతను గురించి కాదు నా ఈ పోస్ట్ .... అమెరికా లో "చిక్కుమేవ జయతే" అనే నానుడి అనుక్షణం గుర్తెట్టుకోకుండా దారి పక్కన పిజ్జా కొట్టు వాడు పిలిచాడని ఆ పక్కన మాల్ లో చైనీస్ వాడు ఒకటే కేకలు వేసి పిలిచి మొహమాటం పెట్టీ 5$ కే బోలెడంత ఇస్తానని ఆశ పెట్టేడని వెళ్ళేమా........ ఆతరు వాత ఇదిగో నాలా ఇలా నానా కష్టాలు పడవలసి వస్తుంది అనే సందేశాన్ని ఈ ఆది వారం మన బ్లాగ్లోకం మిత్రులకు చెప్పి నా ఎద ఘోష ను పంచుకుందామని మొదలు పెట్టేను...
పొద్దు నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని కోసం అటు ఇటు పరుగులెత్తి కాలేజ్ నుంచి ఇంటికి, అక్కడి నుంచి ట్యూషన్ కు, అక్కడనుంచి వూరి మీద పెత్తనాలకు తిరుగుతు ఎప్పుడు ద్విచక్ర వాహనం (సైకిలు, మోపెడ్ లు కాదని గమనించ ప్రార్ధన) మీదో..... నిలువు కాళ్ళమీదో తిరుగుతు కాసేపు ఖాళీ వస్తే ఏవో ఒక ఆటలు ఆడుతు పెరిగి వచ్చిన గతం నుంచి, (అంటే 20 ఏళ్ళ కితం మేము నిజం గానే ఇవన్ని చేసే వాళ్ళము మరి ఇంతలేసి చదువుల పోటీ లు అప్పట్లో లేవు కదా, తినింగ్స్ తిరిగింగ్స్ కదా మొదటి వ్యాపకం చదువు తరువాత వ్యాపకమే)
ఈ జంతర్ మంతర్ మాయా లోకం లోకి వచ్చి పడి..... చిన్నా పెద్దా ప్రలోభాలకు ఆశ పడి...... ఇందాక నేను చెప్పినట్లు కొండకచో కక్కూర్తి పడి..... తిని...... తరువాత పిల్లలతో కలిసి తిని, మొత్తనికి తిని తిని అర్ధం అయ్యింది కదా.......
ఒక రోజు పొద్దున్నే పిల్లలు మనలను విసిగించకుండా వాళ్ళంత వాళ్ళే తయారు అయ్యి స్కూల్ కు వెళ్ళిన శుభ సందర్భం లో తీరిక గా అద్దం లో చూసుకుంటే ఏమి వుంది డింగ్.... డింగ్ డింగ్... నెత్తి మీద తెల్ల వెంట్రుకలు, తాపీ గా శరీరం మీద ఎప్పుడు వచ్చి చేరిందో ఆట్టే గమనించకుండానే చేరిన ఒక 20 పౌండ్స్... కళ్ళ కింద నల్ల చారలు...
అంతే సీన్ కట్ చేస్తే ట్రెడ్ మిల్ల్ మీద లగో లగో... తెల్ల బియ్యపు మూట మాయం అయ్యి చేరిన గోధుమ పిండి గోతాం... గోధుమ రవ్వలు అబ్బో ఒకటేమిటి లే...
అందుకే
ఇంట్లోను పని లోను పెద్ద అక్షారాలతో
ఈ మూడు సూత్రాలు ప్రింట్ చేసి పెట్టు కున్నా ప్రతి క్షణం కనపడేటట్లు..
"చిక్కుమేవ జయతే" , "డైటింగే పరమో ధర్మః" , " దేహో రక్షతి ఆరోగ్యం రక్షితహ" (ఇది బ్లడ్ ప్రెషర్ వచ్చినాక కలిపేను... )
25 comments to “చిక్కుమేవ జయతే ...”
-
Welcome and all the best :)
-
అందరి జీవితాల్లో జరిగే అతి మామూలు విషయాలను సరదాగా బాగా చెప్పారు. మేమెప్పుడూ అనుకుంటాం. అమెరికావాళ్ళు ఈ ఆహార ప్రమాణాలను తగ్గిస్తే బాగుంటుందేమోనని. కాఫీకి, కూల్ డ్రింక్స్ కీ ఆ గ్లాసులేటండీబాబూ దిష్టితగిలేలా లేకపోతే మనవాళ్ళు నవ్వుకునేలా.
psmlakshmi
-
baagundi,bhavanaa.........
meeru cheppindi antaa nijamee ani nokki vakkanistunnanu.
all the best.
keep it up.
-
marichi pokundaa paatinchandi.
best of luck
-
సృజన, లక్ష్మి, p.s.m. లక్ష్మి గారు, సుభద్ర, మాల గారు అందరికి ధన్య వాదాలు...
p.s.m. లక్ష్మి గారు, అవునండోయ్ మర్చే పోయాను కోక్ కాఫీ ల సైజు లు చెప్పటం
-
భావనా, మీరు కూడానా:-)
ఈ బ్లాగు పేరు నేను మొదట "భావనా తరంగం"అని చదివి మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిగా "భావనాంతరంగం"అని చదివాను. :-)
-
good one... simple but straight forward
-
"చిక్కుమేవ జయతే" , "డైటింగే పరమో ధర్మః" , " దేహో రక్షతి ఆరోగ్యం రక్షితహ-ha..ha.haa
-
అవును సుజాత మీ అందరిని చూసి నేమ్మది గా ధైర్యం కూడ గట్టుకుని నేను దిగేను రంగం లోకి.. నాకు వుత్తరాలు తప్ప రావు (అవి కూడా రావనుకోండి నిజానికి అంటే మిగతా వాటి మీద better) ఎక్కడైనా తప్పులుంటే మరి సరి చేసే భాద్యత మీదే సుమా.
పేరు తికమక పడ్డారా. వూరికే పడతారో లేదో అని.. అలా పెట్టేను..
మరి నవ్వు వచ్చినా నిజం కధా సాగర్ గారు. ధన్యవాదాలు.
-
భావన గారూ !అభినందనలు ...మీ కొత్త బ్లాగ్ బావుంది . అలాగే ఒకసారి ఉలిక్కిపడేలా రాసారు పోస్ట్ :)
-
భావనా,
మీరు కూడానా అంటే మీరు కూడా ఇలాంటి పోస్టులు రాస్తున్నారా అని కాదు సుమా! మీరు కూడా డైటింగ్ లోకి వచ్చారా అని! మీ బ్లాగులో తప్పులు దిద్దేంత సాహసమే?
-
ధన్యవాదాలు పరిమళ ....
ఏమి చేస్తాము సుజాత ఎంత నేర్చిన... ఎంతా కూర్చిన ఎంత వారలైన తిండి దాసులే... (రాగం తెలుసు కదా ఆ రాగం లో కూని రాగం తియ్యండి, మీ నరసరవు పేట వాళ్ళకు ఎలా ఐనా అన్నీ తెలుసు కదా) కోపగించుకోకండి నా బెస్ట్ ఫ్రెండ్ ది మీ వూరే అందుకని ఆ సనువు కొద్దీ...
-
పరిమళ మరి వులిక్కి పడక ఏదో మాట వరసకు 20 అన్నా కాని ఇంక ఎక్కువే వుంటుంది మరి లెక్క.. వా... వా.. అని ఏడవటం ఒక్కటే తక్కువ..
-
బ్రౌన్ రైస్, మొలకలు, సలాడ్ల మాట రాయలేదే? నాకైతే ఎలిప్టికల్ మీద ఎక్కినపుడు అపుడపుడూ రిక్షాలు ఎక్కి పాపం ఆ బడుగు జీవుల్ని కష్టపెట్టబట్టే నాకీ శిక్ష అనుకుంటాను. కానీ పదేళ్ళ క్రితం ఎలావున్నానోఇప్పుడూ అలాగే వున్నాను. అదొక్కటే ఆనందం. ఇంకొంచం వెనక్కి జరిగి 15సం. క్రితం మాదిరి వుండటానికి ఈ ఆరాటం.
-
అదృష్టవంతులు ఉషా.. అవును సుమా మర్చేపోయాను బ్రౌన్ రైస్ సలాడ్ ల గురించి.... అయ్యో... రామా తలుచుకుంటే ఆ ఎపిసోడ్ విరక్తి వస్తుంది తిండి అంటే... ఈ కంపేరిజన్ బలే వుందే ఎలిప్టికల్ ఎక్కినప్పుడల్లా రిక్షవాడిని తలుచుకోవటం.. మీకు బలే ఆలోచనలు వస్తాయి ఉషా.. :-)
-
బావుంది భావన గారు.. మితభోజనా డైటోభవంతు అన్నారు పెద్దలు ..
-
అబ్బ..ఇన్నాళ్ళకు టైం దొరికింది. దీంతో మొదలెట్టా. "తినింగ్స్ తిరిగింగ్స్" ఏదో లోకంలో కోల్పోయిన మాటలాగా ఉంది. తిరిగిరాని కాలాలు తిరొచ్చినట్లుగా ఉంది.
-
sorry andi late ga chusthunanu mee blog.
"చిక్కుమేవ జయతే" , "డైటింగే పరమో ధర్మః" , " దేహో రక్షతి ఆరోగ్యం రక్షితహ"
ha ha ha ha emi chepapru andi
please watch my postings also
-
ఆరోగ్యమే మహా బాగ్యం....బాగా చెప్పారు..
-
స్పందించిన అందరికి దన్యవాదాలు. ఇండియా వెళ్ళటం తో వెంటనే చెప్పలేక పోయాను.
-
abbo abbo suparu. iragadeesarandi.
-
చాలా బాగా రాసారు.
-
ఇంకేముంది డింగ్ డాంగ్
కడుపులో కరకరలు
పేగుల్లో గరగరలు
బస్తా బియ్యం గంటెడు పప్పు
చారెడు నెయ్యి కడుపున పొయ్యి
ఇంకేముంది డింగ్ డాంగ్...
లగో లగో లబో దిబో
అబ్బా అమ్మో, అయ్యా అమ్మో
లంబోదరా! అంబాసురా!
పాహిమాం పాహిమాం
కట్ చేస్తే
గోధుమ రవ్వ గోతము నిండా
గోడకు చేరి లబో దిబో
నెయ్యి చుక్క ఒక్క బొట్టు
చప్పిడి కూడు, నో కోడికూరా
అయినా సరే
అబ్బా అమ్మో, అయ్యా అమ్మో
లంబోదరా! అంబాసురా!
పాహిమాం పాహిమాం
-
భా.రా.రె గారు.. అబ్బ ఎంత బాగా చెప్పేరండి నేనైతే కాసేపు చేసే పని ఆపి కూచుని నవ్వేను, మా అబ్బాయి అడిగేడు కూడా ఏమిటి అమ్మా అంత జోక్ అని, (ఆఫ్కోర్స్ అప్పుడు వెంటనే కోపం వచ్చి క్లాస్ పెట్టేననుకోండీ అందుకే వెధవా తెలుగు చదవటం నేర్చుకోమంటే అత్తెసరి వెధవ ఎప్పుడు చూడు గుడింతాలు దాటవు నీకు ఏమి అర్ధం అవుతుంది ఇంత చక్కటి కవిత అని)... మళ్ళీ పబ్లిష్ చేసేప్పుడూ ఇంకోసారి లంబోదర లకుమిక రా అంబాసుర అమర వినుత అంటు హార్మోనియం పట్టుకుని మీరు కవిత చదివినట్లు వూహించుకుని మళ్ళీ నవ్వుకున్నా. చాలా బాగా చెప్పేరు మేస్టారు...
@ ఆ. గా గారు, @ సృజన్ గారు ధన్యవాదాలండి నచ్చినందుకు...
:-)