ఎప్పుడో 230 ఏళ్ళ పై మాటే అమెరికా కు స్వాతంత్రం వచ్చి... వుహూ బ్రిటన్ వాళ్ళ నుంచి తీసుకుని ... ఎంత పెద్ద విజయమో.. !!!!ఎన్నెన్ని ఎత్తు పల్లాలో... ఎన్నెన్ని వివక్షతలో... వితరణలో... ఎన్నెన్ని దేశాల నుంచి ఎన్ని లక్షల మందో వచ్చి ఈ దేశాన్ని తమది గా చేసుకున్న వైనం. తలచుకుంటే చిత్రం...!!! స్వయం శక్తి తో ఆలోచించి తెచ్చుకున్న అబ్బుర పరిచే శక్తి..... ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చుకోగల ధీయుక్తి..
బానిసలు గా తెచ్చుకున్న నల్ల జాతీయులు... వారి తిరుగుబాటు... ఇప్పటికి వారిని బానిసలు గానే గుర్తిస్తున్న కొన్ని రాష్ట్రాల confederates...... మూతి మీద మీసమున్న వాడల్లా అరబిక్ సాహెబులు అనే అమాయకత్వం లో కొందరు.... ఇండియా వాళ్ళు కనపడితే వూరికే చేతులూపకుండా (షేక్ హేండ్స్) నమస్తే చెప్పి తప్పుకునేంత గా మన సంస్కృతి తెలిసిన వాళ్ళు మరి కొందరు... తెల్ల వాళ్ళ మధ్యనే కొందరిని చిన్న చూపు....... మరి కొందరికి పెద్ద పీట, అసలు వాళ్ళ దేశమైన రెడ్ ఇండియన్స్ కు వెనుకబడిన తెగల, జాతుల కింద రిజర్వేషన్స్. సంస్కారమంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనేంత గా ఎదుటి వాళ్ళను గౌరవించే తత్వం, ఎదుటి వాళ్ళ నమ్మకాలకు విలువలకు ప్రాధాన్యత నిచ్చే సాంప్రదాయం... ఎన్నెన్నో దేశాల, జాతుల, తెగల మధ్యన.... భినత్వం లో ఏకత్వం... ఏకత్వం లో కోకోటి స్వరాలు.....ఇది ఈ దేశం గురించి నాలుగు మాటలలో చెప్పాలనుకుంటే...
నిజం గా నిజం చెప్పాలంటే ఈ దేశానికి ఎందుకొచ్చానో నాకే తెలియదు. బాగా డబ్బులు సంపాదించాలనా? బాగా చదువు కోవాలనా? పిల్లల కు మంచి భవిష్యత్తు (అంటే మనకు అందనిది, అదేమిటో మరి తెలియదు) ఇవ్వాలనా? ఇలా అనుకోవటానికి కొంచం చిత్రం గానే వున్నా ఏమో ఇప్పుడు తలచుకుంటే అప్పట్లో నా మనసులో ఏమి వుందో నిజం గా గుర్తు రావటం లేదు ....
ఏమోలే ఎందుకొచ్చినా...... ఈ దేశపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశం గురించి నాలుగు మంచి మాటలు పంచుకోవటమే సముచితమని నా ఆలోచన.
మధ్య తరగతి జీవితాలలో పెద్ద గా ఎదుర్కోని వొడి దుడుకులు.... ఒక క్రమశిక్షణ.. నిబద్ధత... ఎన్ని ఆర్ధిక మాంద్యాలొచ్చినా ఇది వరకల్లే నే తేరుకుని వువ్వెత్తున పైకి లేస్తుందనే ఆశ... ప్రకృతి పచ్చదనం ఆ ప్రకృతిలోని వైవిధ్యత..... ఇంకో పక్క మనది కాని సంస్కృతిని మనది చేసుకునే మమైకత..
నాకు ఈ దేశం లో బాగా నచ్చేదేమిటంటే వాళ్ళ ప్రజలకు.... వాళ్ళ ప్రాణాలకు.. వాళ్ళు ఇచ్చే విలువ... వెంటనే అడుగుతారు మీరు.. వాళ్ళది కాని సమస్య కోసం వాళ్ల వాళ్ళను యుద్ధానికి పంపి చంపుకుంటున్నది ఇతరులను చంపించేది అమెరికా కాదా అని. బహుళ జాతి సామాజిక ఆర్ధిక ప్రయోజనాల కోసం అవును అమెరికా తీసుకున్న నిర్ణయాలు మిగతా కొన్ని దేశాలకు కంటగింపు గానే వుంటాయేమో కాని అమెరికా లోని పౌరులకు ఆఖరు లో మంచి ఫలితాలనే ఇవ్వటానికి దేశం ప్రయత్నిస్తుంది అని నా నమ్మకం.
ఇక దేశం లోని మన పరిస్తితి అంటే, నాకైతే ఏం ఇబ్బంది అనిపించదు మరి... కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఆ వివక్షత కనపడుతుంది అంటారు కాని మా వైపు ఏమి అనిపించదు. ఇప్పటికే మనమేదో బాగా తెలివైన కుందేళ్ళమని, మనం ఈ దేశం లో బాగా నాటుకు పోయే మైనారిటీలమని ఇక్కడి అందరి బలమైన నమ్మకం. అలా పాతుకు పోవటానికి మనం పెట్టే పణం ఏమిటో మనం కోల్పోయే జీవితం ఏమిటో వీళ్ళకు అర్ధం కాదు. కోల్పోయే వాళ్ళకే అర్ధం కాదు ఇంక బయట వాళ్ళకు ఏం అర్ధం అవుతుంది లే.
చాలా మంది అదే దో రూల్ లా పుట్టిన దేశమో ఈ దేశమో ఏదో ఒక దానినే ప్రేమించాలి మరొక దానిని ద్వేషించాలి అన్న పంధా లో వుంటారు... నాకైతే రెండు దేశాలన్నా ఇష్టమే ... ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు.. ఒకటి నను కన్న దేశం.. నా మూలాలని గట్టి పరచి నను పెద్ద చేసిన దేశం. ఇంకొకటి నే మెట్టిన దేశం. నా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పి..... జీవితమంటే నేర్పి న దేశం... ఏది గొప్పదంటే ఎలా చెప్పగలం.
మొత్తానికి ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని, నా మాతృ దేశం గురించి నేను సమూలం గా గర్వ పడగల సంస్కారాన్ని కూడా పెంచింది. అందుకే ఎవరేమన్నా I love America. Yes it's a capitalistic country. Which isn't ?
Happy Independence Day .....







Happy Independence Day Bhaavanaa...Enjoy your self & have a nice time. I wish you all the best.