Subscribe RSS

     స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి.....    
ఎప్పుడో 230 ఏళ్ళ పై మాటే అమెరికా కు స్వాతంత్రం వచ్చి... వుహూ బ్రిటన్ వాళ్ళ నుంచి తీసుకుని ... ఎంత పెద్ద విజయమో.. !!!!ఎన్నెన్ని ఎత్తు పల్లాలో... ఎన్నెన్ని వివక్షతలో... వితరణలో... ఎన్నెన్ని దేశాల నుంచి ఎన్ని లక్షల మందో వచ్చి ఈ దేశాన్ని తమది గా చేసుకున్న వైనం. తలచుకుంటే చిత్రం...!!! స్వయం శక్తి తో ఆలోచించి తెచ్చుకున్న అబ్బుర పరిచే శక్తి..... ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చుకోగల ధీయుక్తి.. 

బానిసలు గా తెచ్చుకున్న నల్ల జాతీయులు... వారి తిరుగుబాటు... ఇప్పటికి వారిని బానిసలు గానే గుర్తిస్తున్న కొన్ని రాష్ట్రాల confederates...... మూతి మీద మీసమున్న వాడల్లా అరబిక్ సాహెబులు అనే అమాయకత్వం లో కొందరు.... ఇండియా వాళ్ళు కనపడితే వూరికే చేతులూపకుండా (షేక్ హేండ్స్) నమస్తే చెప్పి తప్పుకునేంత గా మన సంస్కృతి తెలిసిన వాళ్ళు మరి కొందరు... తెల్ల వాళ్ళ మధ్యనే కొందరిని చిన్న చూపు....... మరి కొందరికి పెద్ద పీట, అసలు వాళ్ళ దేశమైన రెడ్ ఇండియన్స్ కు వెనుకబడిన తెగల, జాతుల కింద రిజర్వేషన్స్. సంస్కారమంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి అనేంత గా ఎదుటి వాళ్ళను గౌరవించే తత్వం, ఎదుటి వాళ్ళ నమ్మకాలకు విలువలకు ప్రాధాన్యత నిచ్చే సాంప్రదాయం... ఎన్నెన్నో దేశాల, జాతుల, తెగల  మధ్యన.... భినత్వం లో ఏకత్వం... ఏకత్వం లో కోకోటి స్వరాలు.....ఇది ఈ దేశం గురించి నాలుగు మాటలలో చెప్పాలనుకుంటే...

నిజం గా నిజం చెప్పాలంటే ఈ దేశానికి ఎందుకొచ్చానో నాకే తెలియదు. బాగా డబ్బులు సంపాదించాలనా? బాగా చదువు కోవాలనా? పిల్లల కు మంచి భవిష్యత్తు (అంటే మనకు అందనిది, అదేమిటో మరి తెలియదు) ఇవ్వాలనా? ఇలా అనుకోవటానికి కొంచం చిత్రం గానే వున్నా ఏమో ఇప్పుడు తలచుకుంటే అప్పట్లో నా మనసులో ఏమి వుందో నిజం గా గుర్తు రావటం లేదు ....

ఏమోలే ఎందుకొచ్చినా...... ఈ దేశపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశం గురించి నాలుగు మంచి మాటలు పంచుకోవటమే సముచితమని నా ఆలోచన.


 మధ్య తరగతి జీవితాలలో పెద్ద గా ఎదుర్కోని వొడి దుడుకులు.... ఒక క్రమశిక్షణ.. నిబద్ధత... ఎన్ని ఆర్ధిక మాంద్యాలొచ్చినా ఇది వరకల్లే నే తేరుకుని వువ్వెత్తున పైకి లేస్తుందనే ఆశ... ప్రకృతి పచ్చదనం ఆ ప్రకృతిలోని వైవిధ్యత..... ఇంకో పక్క మనది కాని సంస్కృతిని మనది చేసుకునే మమైకత..

నాకు ఈ దేశం లో బాగా నచ్చేదేమిటంటే వాళ్ళ ప్రజలకు.... వాళ్ళ ప్రాణాలకు.. వాళ్ళు ఇచ్చే విలువ... వెంటనే అడుగుతారు మీరు.. వాళ్ళది కాని సమస్య కోసం వాళ్ల వాళ్ళను యుద్ధానికి పంపి చంపుకుంటున్నది ఇతరులను చంపించేది అమెరికా కాదా అని. బహుళ జాతి సామాజిక ఆర్ధిక ప్రయోజనాల కోసం అవును అమెరికా తీసుకున్న నిర్ణయాలు మిగతా కొన్ని దేశాలకు కంటగింపు గానే వుంటాయేమో కాని అమెరికా లోని పౌరులకు ఆఖరు లో మంచి ఫలితాలనే ఇవ్వటానికి దేశం ప్రయత్నిస్తుంది అని నా నమ్మకం. 

ఇక దేశం లోని మన పరిస్తితి అంటే, నాకైతే ఏం ఇబ్బంది అనిపించదు మరి... కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఆ వివక్షత కనపడుతుంది అంటారు కాని మా వైపు ఏమి అనిపించదు. ఇప్పటికే మనమేదో బాగా తెలివైన కుందేళ్ళమని, మనం ఈ దేశం లో బాగా నాటుకు పోయే మైనారిటీలమని ఇక్కడి అందరి బలమైన నమ్మకం. అలా పాతుకు పోవటానికి మనం పెట్టే పణం ఏమిటో మనం కోల్పోయే జీవితం ఏమిటో వీళ్ళకు అర్ధం కాదు. కోల్పోయే వాళ్ళకే అర్ధం కాదు ఇంక బయట వాళ్ళకు ఏం అర్ధం అవుతుంది లే.


చాలా మంది అదే దో రూల్ లా పుట్టిన దేశమో ఈ దేశమో ఏదో ఒక దానినే ప్రేమించాలి మరొక దానిని ద్వేషించాలి అన్న పంధా లో వుంటారు... నాకైతే రెండు దేశాలన్నా ఇష్టమే ... ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు.. ఒకటి నను కన్న దేశం.. నా మూలాలని గట్టి పరచి నను పెద్ద చేసిన దేశం. ఇంకొకటి నే మెట్టిన దేశం. నా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పి..... జీవితమంటే నేర్పి న దేశం... ఏది గొప్పదంటే ఎలా చెప్పగలం.


మొత్తానికి ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని, నా మాతృ దేశం గురించి నేను సమూలం గా గర్వ పడగల సంస్కారాన్ని కూడా పెంచింది. అందుకే ఎవరేమన్నా I love America. Yes it's a capitalistic country. Which isn't ? 


Happy Independence Day .....

26 comments to “స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి.....”

 1. Happy Independence Day Bhaavanaa...Enjoy your self & have a nice time. I wish you all the best.

 1. బాగుందండి . మీకు స్వాతంత్ర్య దినోత్సవశుభాకాంక్షలు !

 1. I too agree with you.

 1. బహు బాగు..చితక్కొట్టావురా బంగారం.

 1. స్నేహితురాళ్ళిద్దరూ అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున మీ భావనలు చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

 1. మీకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

 1. happy independence day bhavana.but i was reallyu disappointed.intha chinchukuni raasina meeru August 15th gurinchi helana ga rayatam nijam ga chala bada ga vundi.ee dasamu padina kastalu e desam padaledemo ! mana desam ...enno viluvaina prana tyaagalu mimmlani ee roju america lo vundettu chesaayi,adi marchi poothe dani antha kruthaghnatha marokati ledu.
  "maa amma andamga ledu pakkinti amma bagundi kanuka amma ani pilusthanu annadu ta evado" ala vundi vyaasam.
  USA ni kinchaparachatam ledu gamaninchaali.

 1. పుట్టినింటినీ, మెట్టినింటినీ ఒక్కలాగే చూపించారు. బాగుంది.

 1. @ జయ,శ్రావ్య, సునీత,ఉష, విజయ్ మోహన్ గారు, ఇండీయన్ గారు ధన్యవాదాలు.
  @ నీహరిక,సుజాత : వచ్చెయ్యిండి, వచ్చెయ్యిండి ఇంకో రెండు నెలలలో మంచి ఫాల్ కలర్స్ వస్తాయి. స్నేహితులతో కలిసి ప్రకృతి శోభ ను చూడటం కంటే గొప్ప అనుభవమేమి వుండదు.
  నీహరిక. ఇప్పుడే వచ్చేస్తే మంచి అడవులు జలపాతాలు నదులు సముద్రాలు చూపిస్తాను రండి మరి.

  @ శ్రీలలిత: అంతే కదండి.. పుట్టినిల్లు గొప్పదానిదే, మెట్టీనింటీ గొప్ప దానిదే.. ఏదీ తక్కువ కాదు.

 1. @ సావిరహే గారు: ధన్యవాదాలు విష్ కు. నేను మన దేశాన్ని తక్కువ చేసి చూపించానని మరి మీకెందుకు అనిపించిందో నాకు తెలియదు. మన స్వాతంత్ర దినోత్సవం రోజు నేను కేవలం ఆడవాళ్ళ స్వాతంత్రం గురించి వ్యంగ్యం గా అన్నాను. అందులో దేశాన్ని కించపరిచేది ఏమి వుంది. అలా చూస్తే ఈ పోస్ట్ లో కూడా ఒక జాతి వాళ్ళను వీళ్ళు కించపరిచే విధానం కూడా చెప్పేను. అంత మాత్రాన కించపరిచినట్లు అవుతుందా...
  మా అమ్మ ఒక్కటే అందంగా వుంది ప్రపంచం లో అనుకోవటం చిన్నతనం (తప్పు కాదు అలా అనుకోక పోతే బాల్యమే కాదు బాల్యం లేనప్పుడు మిగతా దశలుండవు మరి) కాని అందరు అమ్మలను గుర్తించటం కూడ ఒక దశే కదా.

 1. 1.sthree swatantrayam gurchi helana chesaanu ani cheppinanaduku santhosam.antha dikkumaalina sthithi lo ledu eee desapu aadadi.gamaninchagalaru.
  2.aadadi kevalam kaama sukhanike ani prapanchaaniki ee desam sthree viluva ante emito prapancham desalaki chupindi.evvaro kuhanaa vetthala araachakatwaanni aa vyavastha motthanni dushinchatam kevalam adhunika agnanam.
  3.andari ammalanu gurthinchavaddani cheppalede ,kaanee mundu mana ammanu gurthinche dasa nunde aa chivari dasa vasthundani chepthunna ledante migiledi durdase!!
  4.okkasaari mee rendu postlu daggara petti chudagalaru.(USA,Indipendece)(IND indpndnc)chusthe meeru em raasaro meke telsthundi.

 1. @ సావిరహే గారు: అవును స్త్రీ స్వాతంత్రం గురించే హేళన చేసేను,స్త్రీ దిక్కుమాలిన స్తితి అనేది పెద్ద పదం కాని మీరు చూసిన మీకు తెలిసిన ప్రపంచమే ప్రపంచం కాదు, మీ అదృష్టం.. మీ గొప్పతనమేమో మీరు పూజించబడుతున్న, గొప్పగా చూడ బడుతున్న స్త్రీ నే చూసి వుంటారు మరి నా దురదృష్టం నేను రెండూ రకాలు చూసేను.
  నేను ఏ దేశాన్ని కించపరచలేదు ఇంతకు మించి మీకు explanation ఇవ్వవలసిన అవసరం నాకు కనిపించలేదు.. చూసే కన్ను ను బట్టీ చూస్తున్న విషయం వుంటుంది. మీరు గొప్ప వాళ్ళు సరేనా వొప్పేసుకున్నాం కదా.. :-)

  నేను ఏ స్టేజ్ లో వున్నానో మీరు చెప్పనవసరం లేదు, మీరు ఏ స్టేజ్ లో వున్నారో నేను తెలుసుకోవలసిన అవసరమూ లేదు. తప్పకుండా మీ తృప్తి కోసం మీరు గొప్ప స్తితిలో నేను తక్కువ స్తితి లోనే వున్నా అనుకోండి.
  ఇంక ఇంతటి తో చర్చ ముగించేద్దాం.

 1. ...... ఇప్పటికే మనమేదో బాగా తెలివైన కుందేళ్ళమని, మనం ఈ దేశం లో బాగా నాటుకు పోయే మైనారిటీలమని ఇక్కడి అందరి బలమైన నమ్మకం. అలా పాతుకు పోవటానికి మనం పెట్టే పణం ఏమిటో మనం కోల్పోయే జీవితం ఏమిటో వీళ్ళకు అర్ధం కాదు. కోల్పోయే వాళ్ళకే అర్ధం కాదు ఇంక బయట వాళ్ళకు ఏం అర్ధం అవుతుంది లే.

  చాలా బాగా చెప్పేరు భావనా!
  మనసుకు హత్తుకునేటట్లు,విస్పష్ట వ్యక్తీకరణ !

 1. @సావిరహే,
  What do you know about your mother(land)?

 1. chala baga chepparu anDi, kaani emainaa komchem ibbandiga vumdi i love america anTe.

 1. @ హను : నిజమే.. కాని ఇది కూడా మేము ఎప్పటి నుంచో వుంటున్నాము కదా, మా రెండో ఇల్లు ప్రేమించక పోతే ఎలా చెప్పండి. ఇక్కడ ఎక్కువ తక్కువ అనే ప్రసక్తి లేదు పుట్టీనిల్లు గొప్పదే మరి చాలా జీవితం గడపవలసిన మెట్టినిల్లు గొప్పదే కదా ప్రేమించక పోతే ఎలా చెప్పండి. అర్ధం చేసుకోరూ... ( స్వర్ణకమలం లో భాను ప్రియ ను గుర్తు చేసుకుని ధీర్ఘం పెట్టుకోండి).:-)

 1. అవునూ..అసలు "అమెరికా నాకు నచ్చింది/ఇష్టం" అన్నమాట ఎందుకు అందరికీ అంత మింగుడుపడని మాట అవుతుంది. మనవారికి ఇక్కడి వారిపట్ల సదవగాహన లేక వల్లనా.. http://maruvam.blogspot.com/2009/12/blog-post_31.html మాదిరిగా ఎన్నో ఉదహరించవచ్చు.. ఒకటి చెప్తున్నాను..ఒక పండక్కో/వేడుకకో శ్రమ అనుకోక ఉదయం అమ్మ వాళ్ళింటికి, రాత్రి అత్తగారింటికీ వెళ్ళేవాళ్ళు తెలుసు నాకు. ఫైర్ వర్క్స్ నా కుక్క భయపడుతుంది - అందుకని నా మిగతా కుటుంబం మరొకచోట కాలుస్తున్నారు, నేను తనతో ఇంట్లో ఉన్నాను అనే వారూ ఉన్నారు. మేమేమీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా అనటం లేదే, అన్నిటా మంచిని చూడమంటున్నాము. మనిషి ఎదుగుదల ప్రాతిపదిక మేము మాట్లాడామే కానీ హెచ్చుతగ్గులు కాదుగా?

 1. భావనగారు... చాలా బాగా రాసారు... భావనగారు రాసిన అఖరునుండి రెండొ పెరా ... అది బాగా నచ్చింది

  అవునూ ఇప్పుడు సాయి బాబా గుడి మార్చరటకద.. ఇప్పుడు గుడి వున్న కొత్త ప్లేస్ ( లిటిల్ టన్ రొడ్డు) అప్పుడు నేను వున్న ఇంటికి బాగా దగ్గర... చ అక్కడే వుండి వుంటే మీరు గుడికి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని మా ఇంటికి తీసికెల్దును... :-).

  ఉష గారు : మీరన్నది కరెక్ట్ అండి.. సరి అయిన అవగాహన లేకనే .. ముఖ్యంగా మన ఇండియా మీడియా చూపించే తీరు.. విషయం ఎమిటంటే ఇక్కడకు వచ్చి పరిస్తితులు ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ అంత త్వరగా విమర్శించరు. ఇండియాలొ వుండి.. అమెరికాని కేవలం మన మీడియా ద్వరా మరియూ మన దేశనికి పట్టిన పెద్ద చీడ అయిన కమ్యూనిస్టుల కళ్ళళ్ళొంచి చూడటం వల్ల ఈ పరిస్తితి. ( గమనించల్సిన విషయం ఎమిటంటే అదే కమ్యూనిస్టు నాయకుల పిల్లలు మళ్ళి అమెరికాలొనే సెటిల్ అయ్యరు ) .

 1. అవును ఉష రెండు దేశాలు నాకు ఇష్టమే రెండిటిని ప్రేమిస్తున్నా అంటే ఎందుకో మరి అస్మదీయులు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. :-( మంచి చెడ్డా లేని ప్రాంతమేది చెప్పు. చాలా బాగా చెప్పేవు

  @ మంచు పల్లకి: హ హ హ నన్ను మీ ఇంటీకి తీసుకుని వెళ్ళేవారా, అప్పుడు బ్లాగ్ లో ఒక పోస్ట్ కూడా వేసేవారు భావనాభాదితుడు అని నా నస భరించలేక. ఈ ఇల్లేమిటీ ఇలా వుంది కాస్త సర్దుకోకూడాదా, ఎవరు చెప్పేరు ఆ అన్నం గిన్నె ఆ మూల పెట్టమని ఆ కుక్కర్ తుడీచే పని లేదా, కాస్తా ఆ కాగితాలు సర్దుకోకూడాదా అబ్బాయ్, అస్సలు మీ మొగోళ్ళకు సుభ్రం లేదు.. అవునూ కిందటి సారి వచ్చినప్పుడు పప్పు డబ్బా ఇచ్చా ఏది కడగనన్నా కడిగేరా ఈ టైపు లో "సుబ్బరం మన జీవన విధానం" అని రాయించి ఇంపోజీషన్ ఇచ్చే దానిని, ( మా వూరులో బేచులర్ కుర్రాళ్ళు మా కుటుంబాన్ని ప్రత్యేకం నన్ను) భోజనానికి పిలిస్తే వంట చెయ్యరు అది ఎలాను నేను తెస్తా, ఇల్లు క్లీన్ చేసుకుంటారు. అంత గొప్ప పేరు నాకు మా ఇలాకా లో. మా ఇంటికి బేచ్యులర్స్, కొత్త గా పెళ్ళైన వాళ్ళు (ఇద్దరు ఒకటే గా వంట లు రావు గా ) పాపం బోజనం ఆశ తో వస్తారు వచ్చినోళ్ళు తిని వెనుక దొడ్లో నో లివింగ్ రూమ్ లో నో పేక గీక అని కూర్చుని టీలు పకోడీ లతో పాటు నా సాధింపులు కూడా తింటారు. ఆ టీ ఎందుకు వొలకపోసావు ఎంగిలి కప్ సింక్ లో పెట్టరాదా, ఆ సింక్ లో ఒక గిన్నె కు అన్ని నీళ్ళెందుకు వృధా, ఆ పేపర్ నేప్కిన్స్ అలా చింపి తగలెయ్యక పోతే అక్కడ హేండ్ టవల్స్ పెట్టా తుడుచుకోరాదా.. ఇలా సాగుతువుంటుంది సాగా. ;-) ఇంకా ధైర్యం వుందా పిలవటానికి.
  అవును మీరు సాయి బాబా గుడిని మిస్ అవుతున్నారు. చాలా బాగుంది. అక్కడే చెమ్స్ ఫర్డ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ వుంటుంది కోమల అని. ఆ రోడ్ లన్ని బాగా తెలుసు నాకు.

 1. లిస్ట్ రాసుకున్నా అండి.. ఈ సారి మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ చెక్ లిస్ట్ ఒకసారి చూసుకొని అన్ని ఒకే అనుకున్నాక అప్పుడు పిలుస్తా :-)

  నేను వున్నది Chelmsford లొనే... Technology Drive lo vunna Princeton Commons. (Chelmsford లొ Lowell General Hospitalది ఒక branch వుంటుంది.. దాని పక్క )..మీరు చూసే వుంటారు...

  అవునండి... మిస్స్ అవుతున్న ఎందుకంటే... అప్పట్లొ నేను ఒకటి అనుకున్నా ..అది అవ్వకుండానే రావల్సి వచ్చింది. ఎప్పటికయినా మళ్ళీ ఆ బాబా దర్శనం కలిగే అవకాసం కల్పించాలని బాబా ని కోరుకుంటున్నా.. అప్పుడు తీర్చేసుకొవచ్చు.

 1. అందరినీ పిలిచి భోజనాలు పెట్టేసి,నాకు మీలాగా వంటలు రావమ్మా అని అబద్దాలు చెపుతారా?

  మీ ఇంటికి వంట మేమే చేసుకోవాలేమో అనుకున్నాం.
  పని దొంగ!!!

 1. నీహారిక నాకు నిజంగా గొప్పగా ఏంరావు. మా తోడుకోడలిని చూడాలి పాతిక మందికి చిటికేసే లోపు వంట చేసి పెట్టేది. నిజం గానే పని దొంగను. కాని ఈ కాలం పిల్లలతో పోల్చుకుంటే కాస్త సుభ్రం ఎక్కు.. అందుకని పని చేస్తూ ఆ పిల్లలను కేకలేస్తూ తిరుగుతుంటాను.నా ఏజ్ గ్రూప్ లో నాకు ఎప్పుడూ పార్టీ అయ్యాక గిన్నెలు కడీగే పనే ఇస్తారు. :-(

 1. భావన గారు! నాకు అమెరికా మీద సదాభిప్రాయమే ! మంచి విషయాలు చెప్పారు.

 1. అదెమో కానీ మన జాతకాల పిచ్చిని, మన దేవుళ్ళని బాగా అంటించాం వాళ్ళకీ

 1. మనిషిని మెరికలా తయారుచేస్తుంది అమెరికా అనడంలో అతిశయోక్తి లేదు.ఆ గాలి ఐదురోజుల శ్రమ పరిమళాన్ని వీస్తుంది.రెండు రోజుల విరామ సంగీతాన్ని ఆలపిస్తుంది.అయినా అక్కడి ప్రకృతి నిత్య చైతన్య స్ఫూర్తిప్రదాయిని.భావనగారు అమెరికా గురించి మీ విశ్లేషణ సబబే.

 1. @ మంచుపల్లకి గారు: అవును నాకు ఆ తెలుసు ఆ ప్లేస్, మనోళ్ళు బాగానే వుంటారు కదా సరౌండింగ్స్ లో.
  నమ్మిన వాళ్ళను బాబా ఎప్పుడూ విడవడండీ, తప్పక మీరు కోరిన పని సిద్దించి, తిరిగి మా(మన) వూరొచ్చి బాబా ను చూస్తారు ఇక్కడ. మనో వాంచాభీష్ట సిద్దిరస్తు.

  @సవ్వడి : అవును కృష్ణా నాకు మన దేశమంటే ప్రేమ, ఈ దేశమంటే love ;-)

  @తార: అవునండి. మన కార్ లలో, కంప్యూటర్ డెస్క్ ల మీద చూసి చూసి వినయకుడు కొండకచో శ్రీనివాసుడు, లక్ష్మీ దేవి అలవాటయ్యిపోయారు. మొన్నెవ్వరో హనుమంతుడి విగ్రహాన్ని కూడా గుర్తు పట్టేసేరు నా కార్ లో. ఇక జాతకాల పిచ్చి వీళ్ళకు లేకపోతే కదా మనం కొత్త గా ఎక్కించేది. కామెంటినందుకు నెనర్లు.

  @ఉమాదేవి గారు (నా పేరు కూడా అదే దేవి లేదు అంతే), మీరు వర్ణించిన తీరు ఇంకా బాగుంది. నిజమే మీరు చెప్పినది కూడా., ధన్యవాదాలు కామెంటుకు.