అలా పాటలు వింటున్నా.. హాయి గా "నిరంతరము వసంతములే సంగీతముల సరాగము లె (ప్రేమించు పెళ్ళాడు)" అంటూ బాలూ పాడెస్తున్నారు, ఇంకా ఆగక హాయి గా తన గాంధర్వ గానం తో " ఓం నమహ నయన శృతులకు (గీతాంజలి)" అంటూ, "కీరవాణి... చిలుకలా... పలకవే (అన్వేషణ)" అంటూ మెరిపించి మరిపించి సరే నెమ్మది గా "ఏడంతస్తుల మేడ ఇది వడ్దించిన విస్తరిది (ఏడంతస్తుల మేడ)", "అరటి పండు వలిచి పెడితే తినలేని చిన్నది ఆదమరిచి వూరుకుంటే (ఏడంతస్తుల మేడ)" అంటూ "వుంగరం పడి పోయింది పోతే పోని పోతే పోని (సుజాత)" అంటూ ఏవో అర్ధం పర్ధం లేని పాటలు పాడుతున్నారు. మళ్ళీ నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటానని ఇంతలోనే "పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది (జడగంటలు)" ," తొలి చూపు తోరణమాయె కల్యాణ కారణమాయే (మల్లె పందిరి)" అని మనసును ఎంచక్క గా ఆయన గొంతులో అలలు అలలు గా సాగే వెన్నెల కెరటాలలో, మెరుపు నురగల్లో కలిపేసి తీస్కెళ్ళి పోతూ పోతూ వున్నారు.
అలా సాఫి గా జరిగి పోతే నేను ఈ పోస్ట్ ఎందుకు రాస్తానండి ఏదో ఇల్లు శుభ్రం చేసుకుని మా వాడికి చికెన్ వేపుడు చేసుకునే దానిని కదా, ఇలా చిరపరిచితాలు, మరిచిపోయిన పరిచయాలు అన్నిటిని విని ఆనంద పడుతుండగా హటాత్తు గా "అచ్చా అచ్చా వచ్చా వచ్చా నీకు ప్రేమంటే తెలుసా బచ్చా" అంటూ చిరంజీవి పాట వచ్చింది, అది కూడా మర్చి పోయి అందేసుకున్నా ఖూనీ రాగం తొ, వెంటనే వులిక్కిపడి మా నాన్న అక్కడున్నారేమో అని అటూ ఇటూ చూసేను 'అమ్మయ్య లేరు' అనుకుని ఇంతలోనే అరే నేను ఇప్పుడు వున్న కాలం వేరు వేకప్ బేబీ అనుకుని చెంప తట్టుకుని మళ్ళీ క్లీన్ చేసు కుంటున్నా, ఇక నా మీద చిమాటా శ్రీని గారు కక్ష్య కట్టినట్లు వరుస చూసుకోండి "అందగాడా అందవేరా అందమంతా అందుకోరా అలిగి సొలిగి కరిగిపోకు సందెకాడ (జాకీ)" అంటు జానకమ్మ," అక్కుం అక్కుం అక్కుం ఓం నా సామిరంగ అక్కుం అక్కుం అక్కుం ఓం (కిరాతకుడు)","ఇదో రకం దాహం అదో రకం తాపం (గజదొంగ)" ఇంకా అదేమిటి అబ్బా ఆ "అగ్గిపుల్ల బగ్గు మంటది.. ఆడ పిల్ల సిగ్గులంటది" ఇంకా ఇంకా (ఎందుకులెండి రాయాలన్నా మొకమాటం గా వుంది).. అంటు బాలు వరుసగా షాక్ ల మీద షాక్ లు. అసలు నేను మరిచి పోయాను ఈ పాటలన్ని వున్నాయని కూడా.
ఒక్క సారి అలా గత జీవితమంతా రింగురింగులు గా తిరిగింది, నేను పైన చెప్పిన పాటలన్ని వచ్చినప్పుడు నాకు పాటలు వాటికి అర్ధాలు ఖచ్చితం గా తెలియదు, కాని రెటమతం మాత్రం బాగా తెలుసు. ఏ పాట,ఏమిటి సంభందం లేదు, రేడియో లో వస్తే పాడాల్సిందే దానితో పాటు.నా గొంతు అంతో ఇంతో బాగానే వుండేది, మంచి పాటలైతే మా నాన్న (సుబ్బారావు ఏలూరి) మాట్లాడకుండా కూచుని చక్క గా వినేవారు, ఒక రోజు అక్కుం అక్కుం పాట పాడుతున్నా అనుకుంటా ఇంక చూడు...అక్షింతలు మొదలు, ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యిందో, "నీకు అసలు మంచి పాట పిచ్చి పాట తేడా తెలియదా ఏది పడితే అది పాడతావేమే కొంచమన్నా జ్ఞానం లేదు,పెరిగేవు మళ్ళీ... అసలు ఆలోచించావా ఏమి పాడుతున్నాము దానికి అర్ధం ఏమైనా వుందా వెర్రి మొర్రి పాటలు, కాసేపు చదువుకో అని ఇంక చూడు క్లాస్ లే క్లాస్ లు నేనేమో "ఎమి వుంది అందులో ఎందుకు పాడ కూడదు" అని ఒకటే రెట మతపు ఆర్గ్యుమెంట్ లు, పాపం మా నాన్న ఏంచెపుతారు ఆ పాటలకు అర్ధం, మా అమ్మేమో కూర్చుని మా ఇద్దరిని చోద్యం చూస్తుంది (అలా చూసినందుకు ఆమె కు కూడా అక్షింతలు పడ్దాయి లెండి అప్పుడు).
సరే ఆ రింగులు రింగులు ఆపితే ఇప్పుడు మా అబ్బాయి (సుబ్బారావు యలమంచిలి) కు 15 సవత్సరాలు. సుమారు 25 ఏళ్ళ కితం ఏమి జరిగింది కొంచం ఫార్వార్డ్ చేస్తే అదే సీన్. మొన్నీ మధ్య నా కొడుకు, నేను నా ఫ్రెండ్ "పుట్టిన రోజు కు పిల్లలతో బయటకు వెళదాము" అని అంటె బయలుదేరి, యధా విధి గా నీ పాటలా, నా పాటలా అని కొట్టుకుని యధావిధి గా వాడే గెలిచి ఆ కిస్108 అంట అదేదో స్టేషన్ వింటున్నాడు. ఇంక ఏదో పాట " నేనేమొ టీ షర్ట్ ఆమేమో టైట్ స్కర్ట్, నేనేమో స్నీకర్స్ ఆమేమో హై హీల్స్ వేసుకుంటుంది అందుకని నువ్వు ఆ అమ్మాయినే ప్రేమిస్తావు లే" అంటూ ఎవరో చిన్న పిల్ల పాడుతుంది అవాక్కయ్యి అదేమిటి రా ఆ పాట అన్నా...వెంటనే వాడు (నా రెటమతపు కొడుకు) క్లాస్ పెట్టేడు, వచ్చేప్పుడు నా ఫ్రెండ్ కూతురు దానికి 8 ఏళ్ళు అది నా కార్ లో వస్తూ ఈ పాటే మళ్ళీ వస్తుంటే మొత్తం పాట రేడియో తో పాటు పాడింది.
ఒక్క సారి ఆ సీన్ అలా కళ్ళ ముందు గిర గిరా తిరిగి ఆ శుభ్రం చేసే కర్ర ను అలా గడ్డం కింద పెట్టుకుని ఆలోచిస్తూ వుండి పోయాను. అవును అప్పుడు ఎందుకు పాపం మా నాన్న తో అంత ఆర్గ్యుమెంట్ చేసేను. ఏమి ఆర్గ్యూ చేసేనో కూడా గుర్తు లేదు అడగాలి ఈసారి మా అమ్మ కు ఫోన్ చేసినప్పుడు. "నువ్వేమి చేసేవో అదే నీకు తిరిగి వస్తుంది" హతోస్మి... ఇప్పుడు తెలుస్తోంది నాకు నొప్పి.ఎంత ఎబ్బెట్టు గా వుందో ఆ పాట వింటే అందులోను చిన్న పిల్లల నోటి నుంచి.
జనరేషన్ గ్యాప్ ప్రతి తరానికి తప్పని ఒక సమస్య,అది మరీ భూతం లా ఏమి భయపెట్టటం లేదు కానీ "what goes around comes around" అనే పదానికి నిజమైన అర్ధం తెలుసుకుంటున్నా,ఇంకా మా నాన్నను మాత్రం ఇప్పుడు బాగా అర్ధం చేసుకుంటున్నా, అమ్మ ను కూడా....ప్చ్... టూ లేట్..
chimatamusic లో విందు భోజనం లో రాళ్ళలా శ్రిని గారు ఇలాంటి పాటలు కూడా కొన్ని పెట్టారు ఎంతైనా బాలు వీరాభిమాని గద.ఇంకా పిల్లల విషయాని కొస్తే మొన్న మా మిసెస్ నాతొ మాట్లాడుతూ వొక విషయం లో నేనో తప్పు చేశా అని ఇంకా ఏదో చెప్పా బొయెన్తలొ మా వాడు మమ్మీ 24 hrs లో ఆ పిల్ ఏదో వేసేసుకో మమ్మీ అంటే నోరు వెల్ల బెట్టడం మా వంతయ్యింది .ఇక్కడ టీవీ చానెల్స్ లో వొక ఆమె రాత్రి నేనో తప్పు చేశా అంటే వాళ్ళ స్నేహితురాలు భయపడకు 24 గంటల లోపు ఆ పిల్ వెయ్యి ఏం ప్రాబ్లం వుండదని advertisement అది చుసిన మా వాడు తప్పు అనగానే పిల్ అని అందుకుంటున్నాడు నిజానికి ఆ ఆడ్ ఏంటో తేలిక పోయినా గాని .