

అలా స్నేహితుల పుట్టిన రోజులకు మనకెన్ని విందులో వినోదాలో.. ఆనందపు నవ్వులో.. కేరింతల హేలలో.
ఇక పెద్ద అయ్యే కొద్ది వినోదాల విందుల కాల పరిమితి అనంతమయ్యి.. ఇంట్లో వాళ్ళకి ఎందుకొచ్చిన ఈ స్నేహితుల పుట్టిన రోజులు రా బాబు, దీనిని పట్టలేము ఆ రోజు అనే దీవెనల జల్లు లు తీసుకుంటూ పెరిగేస్తాము కదా.
చిన్న వయసులలో స్నేహితుల పుట్టిన రోజులను చూసిన సినిమాలతోనూ, చేసుకున్న పార్టీలతోను, కొనుకున్న చీరలతోను కలిపి, పుట్టిన రోజు ఆనందాన్ని అంచనా వేసుకోవటం అలవాటు అయ్యినా, పెద్ద అయ్యే కొద్ది జీవితపు రంది లో పడి స్నేహితుల సంఖ్య తగ్గుతుంది (చిన్నప్పుడు అందరూ ప్రాణ స్నేహితులే కదా మరి) , ఆ స్నేహితుల పుట్టిన రోజులను గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పటమే వాళ్ళకు మనకూ కూడా తలకు మించిన జ్నాపకం ఐపోతుంది. :-(
కాని వీటన్నిటి మధ్యన కూడా స్నేహమంటే నిజమైన అర్ధాన్ని, ఆ స్నేహ భందం లోని చిక్కదనాన్ని చక్క దనాన్ని ఒక్క వన్నె తగ్గకుండా, ఒక పిసరంతైన మధురిమ తగ్గించకుండా... కలిసిన చేతుల మధ్యగా అనంతమైన ఆప్యాయతను, లెక్కలేనంత... లెక్క కట్టలేనంత ప్రేమ ను కలబోసి ఇచ్చే నా నెచ్చలి జన్మ దిన శుభాకాంక్షలు చెప్ప గలగటం నా కొక అపూర్వమైన వరం..
నేస్తమా .... గుండె చప్పుడు లోని లయలో నీ మాట, అనంతమైన సముద్రపు కెరటాల నీ ప్రేమ, ఎగిరే పిట్ట రెక్కల సవ్వడుల నీ నవ్వు, రేపటి పొద్దున విరిసే పువ్వుల అంచున విరిసే తళుకున నీ ఆశ కలబోసి ఉంటావేమో, వీటన్నిటిని చూసినప్పుడల్లా నువ్వెప్పుడూ నాకు గుర్తు కొస్తూనే ఉంటావు. నే చెప్పక పోయినా, నా గుండె కష్టం లో మునిగితే.... నీ కంట నీరు తిరిగిందెదుకో అని ఆదుర్దా గా నాతో మాట్లటడటం కోసం ఫోన్ చేస్తావు... దినసరి జీవితం తో తలమునకలై నా ఆచూకి నాకే తెలియటం లేదని బిక్క మొహం పెడితే రేపటి జీవనాల పువ్వుల బాటను మాటల మంత్రజాలం తో నా ముందుఉంచి నడక సునాయసమే అని నచ్చ చెప్పి నవ్విస్తావు.
జీవితపు ప్రతి అడుగునా నిజమైన స్నేహానికి భాష్యం చెపుతూ... చేసే ఆకతాయి పనులను అమ్మ లా మన్నిస్తూ, చెప్పే వెర్రి మొర్రి మాటలను అక్క లా ఆలకిస్తూ, పరుగెత్తి మోకాలు పగలకొట్టుకుంటుంటే నిజమైన నేస్తం లా హెచ్చరిస్తూ, వినక పోయినా ఓర్పు గా చేయూతనిస్తూ , ఆరిందాల సలహాలిస్తుంటే చెల్లి లా వాటన్నిటీకి తల వూచుతూ... జీవితపు ఆటు పోట్ల గమనాలను నెచ్చలివై నాతో పంచుకునే నా నేస్తమా... నీ జన్మ దినాన ఈ నేస్తం నీకు కొత్త గా ఇవ్వగలిగినదేమి ఉంది... ఎప్పటిలానే శుభాకాంక్షలను చెప్పటం తప్ప...
ఏడు రాగాల వర్ణాలను కలిపి ఆనందపు హరివిల్లును చేసి గులాబితో పాటూ ఈ పాటనూ మా మరువాల కొమ్మ కు కానుకిస్తూ...
జన్మ దిన శుభాకాంక్షలు ఉష.
నీ ఉంటే వేరే కనులెందుకు.. నీకంటే వేరే బతుకెందుకూ...
ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు నాతో కలిసి నువ్వు పంచుకుంటావని నీ పుట్టిన రోజున నేనే నిన్ను కానుక అడుగుతున్నా.. ఇస్తావు కదు.
హ్యాపీ బర్త్ డే ఉష