Subscribe RSS

 వాడి మాటల వేటూరి.. మధుర గేయాల రామయ్య...

వాడి మాటల వేటూరి.. మనో సుందర రామయ్య... ఆ కవితా మూర్తి గానవాహిని తో కాసేపు.

పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను  పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి గారి కు ఆశ్రునివాళులతో...


శరీరానికే కాని మనసుకెప్పుడూ వృద్ధ్యాప్యం లేదని ఎప్పటీకి మనసు కు చిగురుటాకుల అనుభవం, చిరుమెత్తని ప్రేమ స్పందన, చిన్నారి వాన చినుకు ఏదైనా ప్రేమ ఘాడతను తిరిగి తెప్పించ గలదని.... నవవసంతాన్ని కలం పలికించగలదని తెలియచెప్పిన సారస్వత మూర్తి కు ఇవే నీరాజనాలు...


కన్నుల పొంగేను కావేరి గొంతున పలికెను సావేరి ఈ నిశీధి లో రగిలే నా హృదయం...  రాగం రాదా ఈ వుదయం నాకోసం -- అని పాడుతూ (కల్యాణి),  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=5354 ,  


వేణువు లోని స్వరమై భువనానికి వచ్చి గాలినై పోతాను గగనానికి (మాతృదేవోభవ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=12459....   


ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకు, చందమామ కు రూపముండదు తెల్ల వారితే... ఈ మజిలి మూడూ నాళ్ళే ఈ జీవ యాత్ర లో.. (సుందరాకాండ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=11039........ఇలా ఎంతెంతో జీవిత వేదాంతాన్నిరస రాగాలలో మా అందరికి పంచి..... మా గగనాన మబ్బు అల్లే అల్లికలలో... వేణువు న సాగే రాగాలలో... మా అందరి మనస్సులలో అజరామరమై నిలిచిన స్వర రాగ సుందరుడి కివే శత సహస్ర వందనాలు.


వందనాలు వందానాలు వలపుల హరి చందనాలు వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి -- అని ఆర్ధ్రత తో పలికించినా (జేగంటలు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=7529...


సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో మలయజ మారుతశీకరమో మనసిజ రాగ వశీకరమో -- అని పదభందంతో మధురం గా వలపు పలికించినా (అమావాస్య చంద్రుడు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=5767...


అలా మండిపడకే జాబిలి చలి ఎండ కాచె రాతిరి -- అని వయ్యారం గా వగలొలికించగలిగినా (జాకీ) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=2115.....


అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక శీతాకాలం సాయంకాలం అటు అలిగి పోయే వేలా.. చలి కొరికి చంపేవేళ -- అని బహు చిన్ని పదాలతో చమత్కారాన్ని మెరిపించినా (శ్రీవారికి శోభనం) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=6016.....,


స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు వణుకు అందగత్తెలో -- అని శృంగార రస వర్షాన్ని కురిపించినా (ఆఖరి పోరాటం)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=10752...ఆయనకు ఆయనే సాటి ఇంకెవరు లేరు ఆయనకు పోటి..


వుహూ అస్సలు తృప్తి లేదు కొన్ని పాటలతో సరి పుచ్చుకోవాలంటే.. ఇంకా కొన్ని చప్పున మనసు కు తోచేవి  కూడా కలపాలని వుంది.


ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటీ వో మేఘమా -- అని దాపున లేని చెలి కోసం విరహాన్ని కురిపించినా (మేఘ సందేశం)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=1364..


రవి వర్మకే అందని ఒక అందాన్ని మాటలో మన కళ్ళ ముందు సాష్కాత్కరింప చేసినా (రావణుడే రాముడైతే) http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=1265...


ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక -- అని జీవిత వేదాంతాన్ని పరిచయం చేసినా (సిరిసిరి మువ్వ)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=4816..


ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితి మంటల చిటపటలే నాలో రగిలే కవితలని -- అని హృదయ గీతాన్ని రగిల్చి (మల్లెపూవు)  http://www.chimatamusic.com/telugu/playcmd.php?plist=2039...
ఇలా ఎన్నని... ఎన్నెన్నని ఆ కృష్ణ వొడ్డున పుట్టి ఆ అందాలను పదే పదే ఆయన తలుస్తూ.... మనలను మురిపిస్తూ, మనో సైకతాన పాటల కోటలను కట్టి దానిలోని ఒక వేలుపై నిలిచిన కవి కు, మనసుకు ఆప్తుడైన మహా మనిషి కు ఆయన పదాలలోనే.... "అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజన అంజలిదే గొనుమా" అని పాడుకోవటం తప్ప తిరిగి ఏమివ్వగలం.... తిరిగి రాని లోకాలలో తన పద చాతుర్యం తో కవితాత్మక హృదయాలను వెలిగించ వెళ్ళి మహారధునికి...
అందుకే కన్నీళ్ళతో ఈ హృదయాంజలి .

Category: | 12 Comments

12 comments to “వాడి మాటల వేటూరి.. మధుర గేయాల రామయ్య...”

 1. నిన్న రాత్రి టివీలో ఈ వార్త విన్నప్పుడు ఇటీవలే చూసిన ఆయన ఇంటర్వ్యూ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...ఆయనా, మరికొందరు గగనానికి చేరిన మహానుభావులూ అందరూ "unique" అండి....no one can replace them...వేటూరిగారికి మీ టపా ముఖంగా నా నివాళి...

 1. ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో?

  ఆకు చాటు పిందె తడిసె

  తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

  సిరి మల్లె పూవా

  వేణువై వచ్చాను భవనానికీ

  కొమ్మకొమ్మకో సన్నాయీ

  ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ

  ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!

  ఆయన కలానికి అన్ని వేపులా పదునే! అంతులేని పాండిత్యమే!

  సాధారణంగా ఎవరు మరణించినా మనవాళ్ళూ ఆయా రంగాలకు తీరని లోటని అలవాటుగా రాసేస్తుంటారు. కానీ వేటూరి మరణం నిజంగానే సినీ రంగానికి తీరని లోటు. ఆ లోటు ఎప్పటికీ భర్తీ కాదు. అంత అలవోగ్గా, ఆశువుగా, అలవాటుగా, నల్లేరు మీద బండి నడకలా పాటలు రాయగల మేథావి మరొకరు ఉంటారని అనుకోను. అప్పుడప్పుడూ సినీ రచయితలు ఒక పాట రాయడానికి తామెంత పురిటి నెప్పులు పడిందీ రాస్తుంటారు. అలాంటి నొప్పులు పడ్డానని వేటూరి రాసినట్లు నేనైతే చదవలేదు.

  మరణం అనివార్యమే కావొచ్చు! కానీ ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మన ఆంతరంగిక ప్రపంచమతో చెప్పలేని అనుబంధాన్ని ఆప్యాయతను ముడివేసుకున్న కళా కారుల మరణం మనసులో ఒక పార్శ్వాన్ని విషాదంతో నింపివేస్తుంది. ఒక ఖాళీని ఏర్పరస్తుంది. వేటూరి ఏర్పరచిన ఆ ఖాళీ ఇక ఎప్పటికీ ఎవరూ పూడ్చలేనిది.

  యమహా నగరి పాటను ఏ బెంగాలీ కవి కూడా అంత అందంగా రాయలేడని నమ్ముతాను నేను.

  బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ’ఆ ఊహ ఎంత అలవోకగా వచ్చిందో కదూ!

  గీతాంజలి అంటూ రవీంద్రుణ్నీ; ‘వందేమాతర గీతం’, ‘దేవదా మార్కు మైకం’, ‘శరన్నవలాభిషేకం’ అంటూ శరత్ నూ తల్చుకుంటాడు. ‘సత్యజిత్ రే సితార, ఎస్ డి బర్మన్ కీ ధార, థెరిస్సా కి కుమారా’ …ఇలా అందర్నీ పలకరిస్తాడు.

  ఎవరు రాయగలరండీ ఇంత సౌందర్య భరితంగా! అసలు “శరన్నవలాభిషేకం”అన్న ప్రయోగం ఎంత అందంగా కొత్తగా ఉంది!

  అలాగే అర్జున్ సినిమాలో “మధుర మధుర తర మీనాక్షి” పాట లో ‘శృంగారం వాగైనది ఆ వాగే వైగై నది’ ..అని రాయడం వేటూరికొక్కడికే సాధ్యం!

  ‘మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో’ అనీ,

  ‘విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ’ అని తెలుగు లింక్ ప్రస్తావిస్తారు.
  వరములు చిలక స్వరములు చిలక, కరమున చిలక కలదాన’ … అనడం వింటే మీనాక్షి పరవశించిపోతుందేమో!

  “కరమున చిలక కలదానా….”..ఎంత బావుంది ఆ భావం!

  ఇలా తల్చుకుంటూ ఉంటే ఆయన పాటల పాతరలో మనం మునిగిపోవాలే తప్ప బయటపడలేం!

  ఈ దుఃఖం అప్పుడే తీరేలా లేదు.

  అవును వేటూరీ..”నువ్వు లేవు…నీ పాట ఉంది”!

 1. "ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక"
  సాహితీ సౌరభాలు వెదజల్లి రాలిన ఈ పూవు ఎక్కడికి ఎగిరిపోయింది? తెలుగు హృదిలోనే తిష్ఠ వేసింది కదా!

 1. తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది. అవును భావనా! ఆయనకు ఎవరూ లేరు సాటి.

 1. తరలిరాద తానే వసంతం రాసింది సీరాశా
  సుందరమో సుమధురమో - ఆత్రేయ

  యమహానగరి అనేది ఒక వికారమైన ప్రయోగం. వేటూరి పాటలలో continuity తక్కువ. అక్కడక్కడ మంచి ప్రయోగాలు చాలాసార్లు వికారాలు సృజించాడు.

 1. కంటి ఎదుట నుంచి శాశ్వతంగా (కోటి) గుండె(ల) గూటికి చేరిందీ చిలుక. కాదా భావన? అయినా మన పిచ్చి గానీ పాటకి మరణమేమిటి? కలం మారుతుంది, కాలం మారుతుంది గానీ గానం, గళం ఆగుతాయారా..

 1. వేటూరి పాండిత్యానికి, సామాన్యానికి మధ్యలో ఒక వంతెనగా నిలిచారు. ఆ వంతెన కూలిపోవడంతో ఇక పాండిత్యం వేరు, సినీకవిత్వం వేరు అయిపోయాయి.

 1. వేటూరి పాండిత్యానికి, సామాన్యానికి మధ్యలో ఒక వంతెనగా నిలిచారు. ఆ వంతెన కూలిపోవడంతో ఇక పాండిత్యం వేరు, సినీకవిత్వం వేరు అయిపోయాయి.

 1. "Tarali raada vasamtam" is Sirivennela's song not Veturi's.

 1. స్పందించిన అందరికి ధన్యవాదాలు.సినిమా సంగీత పరిశ్రమకు సంభందించినంత వరకు స్వర కర్త సంగీత దర్శకుడైతే పద కర్త గేయ రచయతేనేమో. ఆ పని ని సమర్ధవంతం గా చేసి తనకు అప్పగించిన పాత్ర ను నిర్వహించి మరలిపోయిన మంచి రచయత వేటూరి గారు,
  అవునండీ తరలి రాదా--- సిరివెన్నెల గారు.
  సుందరమో సుమధురమో -- ఆత్రేయ గారు కాదను కుంటానండి. వేటూరి ఇళయరాజా గారి కాంబినేషన్ అది.

 1. వేటూరి గారు, మనందరి మనస్సులలో ఇలా సజీవంగా ఉన్నారు,ఉంటారు

 1. భావన గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.