Subscribe RSSచెలి ... విరహమెంత తియ్యనిదే ....
నీ తలపులనే మరీ మరీ గుర్తు చేస్తోంది....
ఈ విరహ మాధుర్యమే కదా ఇంకా మన ఇద్దరినీ
విడి పోనీకుండా ఇలా తెగిపోని రాగాలతో కలిపి ఉంచుతోంది
ప్రియతమా నీ తలపు ఎంత మధురమే అది కన్నీళ్లను రప్పిస్తేనేమి..

నీ తలపు నాకు రక్తాశ్రువును రప్పిస్తే......!!
ఆ ఆశ్రువు నీ దగ్గరనుంచి వచ్చిన ,
నీవానతించి పంపిన ప్రేమ కానుకగా ఎప్పటికీ నాతోనే. . . నాలోనే దాచుకుంటాను

అది బయటకు వెళ్ళిపోయి నిన్ను మరపుకు తెస్తుంది అంటే........
సఖి...... దానిని బయటకు రానీకుండా నీ జ్ఞాపకాల ఆనవాలుగా
మనసులోపలె నిక్షిప్తం చేసి దాని చుట్టూ నీ పెదవికొసనుంచి తేలివచ్చే
బంగారు కాంతుల చిరునవ్వును కాపలా గా ఉంచుతాను లే..

అయినా అది ఎప్పుడైనా అలవోక గా నీ ఆలోచనాంబుధి లో మునిగి..
అర మూసిన నా కనురెప్పల వాలుగా కిందకు జారిపోతే..
నువ్వు నాకు దూర మైపోతావేమో నని అనుకోకు...

హృదయ ఫలకం మీద నీవు విస విసా
నడిచిన పాదాల గుర్తుల చిహ్నాలు ఇంకా మాయలేదులే......

15 comments to “చెలి నీ విరహం....”

 1. chala baagundhi.poster mareenu.

 1. వద్దమ్మా, నేను వదిలేసిన ఈ సీమల్లోకి లాగకే మేనక, ఈ విశ్వామిత్రని కాస్త చూసీచూడనట్లు వదిలేయ్. ;)

  భావన, ముందే చెప్పాగా నిన్ను చూసి కుళ్ళటానికే పుట్టానని... నీ వచన కవితలోని పదాలంత అందంగా నా స్పందన రాలేదు కానీ, వుట్టిపడుతున్న వేదన మాత్రం నా కళ్ళలో నీటికి తెలిసింది.

 1. హృదయ ఫలకం మీది నీ పాదాల గుర్తులని మరెవరూ చూడకుండా ప్రేమ అనే మాధుర్యంలో ముంచేసి దాచేస్తా
  కలతపడే కన్నుల చెమ్మని ఎదుటివారు గమనించకుండా కనురెప్ప కప్పి ఆపేస్తా
  పెదవిపై పలికే నీ నామమే నాకు మంత్రమని తెలిసి ఎవరూ వినకుండా జపించుకుంటా
  నీ ధ్యాసే ధ్యానమై, నీ వలపే లోకమై ఈ విరహాన్ని మధురమైన బాధగా ఆనందంగా ఆస్వాదిస్తా....

 1. చాలా చాలా బాగుందండి,ఎన్ని సార్లు చదువుకున్నానో.

 1. చిన్ని నేను ఖండిస్తున్నా కవిత కంటే పోస్టర్ బాగుండటాన్ని.. హ్మ్... (మనలో మన మాట నిజమే లే) . థ్యాంక్స్..


  ఉష: ఎంత మాట ఎంత మాట ఆ కోనలొదిలేసేవా? ఆ సీమ లలోకి రానే రావా...!!!!! నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను.. గుండె పలికే గొంతు కంటికే గా మరి వినిపించేది...

 1. శ్రీ లలిత గారు: విరహాన్ని మధురమైన బాధ గా ఆస్వాదిస్తా.. ఎంత చక్కటి ఆశ కదా. నా స్నేహితుడు ఎప్పుడో 15 ఏళ్ళ కితం బాధ పడుతుంటే అతని బాధ ను అనువదించా ఆ అమ్మాయి కి ఇవ్వటం కోసం సాయం గా. కనురెప్ప వెనుక దాచిన సముద్రపు హోరు ను గుండెలోని ప్రేమ మాధుర్యం చేసి, నామ జపం తో విరహాన్ని మధురం చేసిన లలిత గారు మీ కవితా శక్తి కి నా జోహారు.

 1. రఘు: మొదటి సారి నా బ్లాగ్లోకం లో కామెంటారు. ఎంత భాగ్యం. మీకు కవిత నచ్చలేదండి అంటే దిగులు పడే దానిని ఖచ్చితం గా అయ్యో రఘు గారికి నచ్చలేదా అని. ఈ రోజే మీ లేఖ చదివా మీ బ్లాగ్ లో.. కామెంట టానికి మాట రాక ఇటు వచ్చా, మళ్ళీ వెళతాను అక్కడికే..

 1. cheli nee viraham chaalaa bavundi.

 1. భావనా ఈ కవిత నాకు చాలా నచ్చింది.
  ...చెలీ, నిన్ను మరవాలని
  నా హృదయాన్ని శిలగా మారిస్తే
  ఆ శిల కరిగి శిల్పమైతే
  ఆ శిల్పానికి ప్రతిరూపం నువ్వయితే
  నిన్నెలా మరువగలను చెలీ...

 1. మీ బ్లాగు చాలా చాల బాగుంది.....
  చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్

 1. అరమూసిన నా కనురెప్పల వాలుగా...
  భావన గారూ మంచి భావన. కవిత చాలాబాగుంది.
  ప్రేమ.. రెండు అక్షరాలు, మూడు ఘట్టాలు
  కలయిక, విడిపోవడం , విరహం
  కోటాను కోట్ల భావనలు..

 1. @ అమర్ గారు ధన్యవాదాలు నచ్చినందుకు
  @ జయ: ధన్యవాదాలు నచ్చినందుకు. మీరు రాసిన కవిత నేను 10th or inter లో వున్నప్పుడు ఎక్కడో చదివేను నాకు చాలా ఇష్టం ఐన కవిత అది మీరే రాసేరా?

 1. @ అనంత్ గారు: ధన్య వాదాలు కవిత నచ్చినందుకు.

  @ శ్రీనిక: అవునండి, ఎన్ని కోట్ల భావాలనైన పలికించగల సామ్ర్ధ్యం వుంది ఆ మూడు పదకు చాలా బాగా చెప్పేరు. ధన్యవాదాలు నచ్చినందుకు.

 1. can't bear it.

 1. @ అజ్నాత గారు: పర్లేదు అండి చదవకండీ.. లోకో భిన్నో రుచి కదా. :-)