Subscribe RSS

ఈ రోజు వన భోజనాలన్నారు కదా జ్యోతి గారు నాకు అసలే వంటలు పెద్ద గా ఇష్టం వుండదు.. తినటం కాదు వండటం ఇష్టం వుండదు..... మా ఇంట్లో మా నాన్న గారు చాలా భోజన ప్రియులు, పెళ్ళి ఐన కొత్తలో మా అమ్మ పప్పు చారు పెడితే నచ్చక పోతే తిన్న చోటు నుంచే ఎంగిలి గిన్నెలు పెట్టే చప్టా వైపు ఒకే ఒక్క తోపు తోసే వారంట మారు మాట లేకుండా.అలా ఆ దూర్వస మహా ముని గారి ని సంతుష్ట పరుచు ప్రక్రియ లో మా అమ్మ వంటల సిద్ద హస్తురాలైపోయింది.. కాని నా కెప్పుడూ అంత వంట చేసే పని రాలేదు, మా అక్క వంట చేసేది పై పని నాతో చేయించేది మా అమ్మ కు ఎప్పుడైనా వొంట్లో బాగోక పోతే... మొత్తానికి పెళ్ళి అవ్వక ముందు మహా ఐతే మొత్తానికి ఒక 10 సార్లు వంట చేసి వుంటా.. అదే మా ఇంట్లో ఇప్పటికి చెప్పి నవ్వుకుంటారు అందరు. అలా బలవంతం గా వంట ఇంటిలోకి తొయ్య బడిన ఒకానొక రోజు ఎదురు గా క్యాబేజీ వుంది వండాలి, ఓస్ ఇది తేలికే కదా అని... ఎంచక్క గా కుక్కర్ తీసి ఒక గిన్నెలో అన్నం ఇంకో గిన్నెలో పప్పు, ఇంకో గిన్నెలో, క్యాబేజ్ పెట్టి కుక్కర్ పెట్టేను, కుక్కర్ వచ్చింది, పక్కన చారు కోసం పెట్టిన గిన్నె లో ఎంచక్క గ ముక్కలన్ని వుడుకు కూడా పట్టేయి అసలు ఓ పేద్ద వంట గత్తె లెక్కన ఫీల్ ఐపోతా కుక్కర్ తీసి గిన్నెలు అన్ని ఒక్కొక్కటి విడి గా పెట్టేను ఇంక చూదు పెద్ద అనుమానం ఇప్పుడు ఈ క్యాబేజ్ ను ఎలా కొయ్యాలి ముట్టుకోవాలంటేనే కుదరటం లేదు అని.. అర్ధం అయ్యే వుంటూంది మీ అందరికి నా నిర్వాకం, క్యాబేజ్ ను తరగ కుండా ఆ వుండ పళాన అలా కుక్కర్ లో పెట్టేను అది వుడికి బయటకు వచ్చింది.. దాన్ని ఎలా కట్ చెయ్యాలో తెలియదు, లేపి మా అమ్మ ను అడిగితే కొంచమన్న పాపం అని లేకుండా అందరికి చెప్పేసింది నాకు క్యాబేజ్ కట్ చేసి వుడక పెడతారని కూడా తెలియదు అని. ఇంక పెళ్ళి అయ్యాక నా వంట ల గోల గురించి ఒక పోస్ట్ రాయాలే కాని రెండు మూడు మాటల లో చెపితే అయ్యేది కాదు..


సరే విషయానికొస్తే ఇంత స్టోరీ చెప్పేక ఇంక నా దగ్గర నుంచి ఎవ్వరు పెద్ద వంటలేమి ఆశించరు కాబట్టి టొమాటో పచ్చడి తో ముగిస్తాను.
నాలు గు దోర టొమేటో లు తీసుకుని ఎంచక్క గా ఒక్కోదానిని నాలుగు ముక్కలు కోసి, ఆ ఏమిటి అంటారు కడ గాలా వద్దా అంటా రా మీ ఇష్టం...గిన్నె లో ఒక చెంచా నూనె వేసుకుని దానిలో నాలుగు పచ్చి మిరపకాయలు మూడు ఎండు మిరపకాయలు (అదేమి లెక్క అని అడ గకండి నాకు తెలియదు నాకు ఆ క్షణానికి ఎన్ని తోస్తే అన్ని వేస్తా)వేయించి పక్కన పెట్టుకుని రెండు స్పూన్ లు మినప పప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా ఆ గిన్నె లో నూనె వుంటె సరి లేక పోతే ఇంకో స్పూన్ నూనె వేసుకుని టొమేటో ముక్కలు వేసి మూత పెట్టాలి, టొమేటో లు కొంచ మగ్గేక ఆ ముక్కలు ఈ వేయించిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరప కాయలు, కొంచం చింత పండు (కొంచం అంటె కొంచెం), వేయించిన మినప పప్పు, ఒక రెండు వెల్లుల్లి గబ్బాలు, ఒక స్పూన్ జీల కర్ర, కొంచం వుప్పు వేసి మిక్సీ లో యాపీ గా నాలుగు తిప్పులు తిప్పండి. మీకు ఇంకా ఈ టొమాటో పచ్చడి గురించి ఆసక్తి వుంటె తాలింపు వేసుకోండి కూసంత నూనె, జరంత ఆవాలు జీలకర్ర, జరంత ఇంగువ వేసి..

తినే వాళ్ళ అదృష్టం బాగుంటె టొమేటో పచ్చడి ఇలా వస్తుంది లేక పోతే ఇక అది మీ వూహ కు వదిలేస్తున్నా
సర్వే జనా సుఖినో భవంతు నా వంట తిన్నాక..


మా అన్నయ్య నా వంట మీద పాడే పాట మీ అందరి కోసం..


వంటంటే తలుసా నీకు తెలియదే వంట చేయకు ......... (టాయ్ టాయ్ టాయ్ విషాదమైన మ్యూజిక్)

వంట చేసానని.... బాగుందని...... పిచ్చి గా కేకలు వెయకు వంట ను శిక్ష గా మార్చకు..

వంటంటే తెలుసా నీకు..

ఏది తినవే చూద్దము తినలేవు కదు

అంతేనె తినమంటె తినలేరు కక్క కుండా వుండ లేరు

అంతేనే నీ వంట ఆంతే ...

అసలు పాట: రావణుడే రాముడైతే... (నాగేశ్వర రావు స్తైల్ లో)

ప్రేమంటె తెలుసా నీకు తెలియందే ప్రేమించకు

మన్సిచ్చానని బదులే లేదని

పిచ్చి గా నిందలు వేయకు ప్రేమ ను చిచ్చు గా మార్చకు..

ఏది నవ్వరా చూదాము నవ్వలేవు కదు

నువ్వు రమ్మంటే రాదు రా నవ్వు

ఇవ్వమంటె ఇవ్వలేరు ఇచ్చామంటే తీసుకోరు అంతే రా జీవితం అంతే..

హ హ హ తిక్క కుదిరింది మా అన్న కు, మా వదిన కూడా నా టైపే వంట లో.. అది కొస మెరుపు..

32 comments to “విందు భోజనం... పసందు భోజనం.. ఏటి ఒడ్డు తోట గట్టు పసందు భోజనం..”

 1. మీ పచ్చడేమో ఆని మీ అన్నయ్య గారి పేరడీ పాట బాగుంది.

 1. >>>అదేమి లెక్క అని అడ గకండి నాకు తెలియదు నాకు ఆ క్షణానికి ఎన్ని తోస్తే అన్ని వేస్తా..
  వంట విషయం లో అన్నీ నా పోలికలే మీకు ..ఎంత బాగా రాసారో

 1. అదిరింది కదా మన టమాటో పచ్చడి ...పెళ్లి ముందు నేను మీకులానే డిటో .....అవసరం రాలేదు ..

 1. చివరలో వచ్చి మమ్మల్ని పచ్చడి పచ్చడి చేసేటట్లున్నారు టొమాటో పచ్చడితో....:)

 1. నేను కూడా అంతే ఇప్పటికి కూడా, ఎవరు వండి పెడతారా, తినేద్దామని చూస్తాను.
  psmlakshmi

 1. చూడగానే తినేద్దా౦ అన్న౦తా బాగు౦ది....కాని మీ అన్నగారి పాట తో కొ౦చ౦ ఆగాను.
  బొమ్మ మాత్ర౦ బాగు౦ది.అల౦కాణ అదే నమ్మ గార్నిషి౦గ్ బాగు౦ది.

 1. క్యాబేజీ ఉపాఖ్యానం బావుంది. క్యాబేజీని అలా డీల్ చేసిన వారు లేరు. మీరు అలానే ముందుకెళ్ళింటే, మరో డిష్షో, డిష్ష్యూమో దొరికిండేది.

 1. పచ్చడీ బాగుంది. పాటా బాగుంది.

 1. టమాటో పచ్చడి తో పాటు కొసమెరుపు సంతోషం , క్యాబేజోపాఖ్యానం బాగున్నాయి . ఆ పాట పెడితే ఎవరూ తినరు , నా పచ్చడి నాకే మిగులు అని ఎత్తేసారు కదూ !

 1. కేబేజీ హోల్సేలుగా వుడకెట్టెయ్యడం .. టమటమాల పచ్చడి .. వంటంటే తెలుసా నీకూ .. భలే భలే .. అమ్మా తల్లీ భావనగారూ, ఎప్పుడన్నా మీ వూరొస్తే, నా ఖర్చు మీద ఇండియన్ రెస్టరాంటుకి తీసుకెళ్తాన్లే, యింటో బోయినం పెడతానని మాత్రం పిలవొద్దు :)

 1. భావన గారు, మీ టమోట పచ్చడి మాత్రం నాకు నోరూరించేస్తుంది.అఫ్కోర్స్ మీ మీద పాటలు కూడా భలే ఉన్నాయండి.

 1. @ సిరిసిరి మువ్వ: వుష్.. మీరు మీ వూరు కేసి వెళ్ళినప్పుడు మా వదిన కనపడితే అనకండే.. తిడుతుంది. నువ్వు, మీ అన్న మీ గోల మీరు పడండి మధ్య నా గురించి ఎందుకు ఇదో వేషమైపోయింది నీకు మీ అన్న కు అని.

  @ నేస్తం: అవును ఎన్నని గుర్తు పెట్టుకుంటాము నేస్తం షుమారు గా తినే వాళ్ళ దంత సిరి ని బట్టి వేసేస్తూ వుండటమే.. ;-)

  @ చిన్ని: అదురుతుంది చిన్ని 7 మిరప కాయలు నాలుగు టొమోటో లకు మరి.. ;-) నేనైతే పెళ్ళి అయ్యాక కూడా మా ఆయన గ్రీన్ కార్డ్ గోల తో 3 ఏళ్ళు ఇండియా లోనే వున్నా అప్పుడూ కూడ యాపీ..

 1. @ విజయ్ మోహన్ గారు: నా వంట అంతే నండి పచ్చడి పచ్చడే అదేంటో ఎంత ప్రయత్నించినా ( వో సోమవారం, పౌర్ణమి అబద్దం చెప్పకూడదు కదు అసలు ప్రయత్నించ లేదు లెండి.. ) రావటం లేదండి..

  @ లక్ష్మి గారు: బలె బలే నా లాంటి వాళ్ళు వున్నారు ఐతే.. అవును అదేంటండి అంత సూపర్ గా పరోటా లు చేసి ఇలా అనేసేరు మీరు అమెరికా వచ్చి కూడ సూపర్ డూపర్ వంటలు చెసేరు.. ఏదో నన్ను ఓదార్చటానికి అన్నారు కదు థ్యాంక్స్ అండి.

  @ సుభద్ర: మా అన్న వుట్టుట్టినే.. బాగుంటుంది దా కొంచం వేస్తా నీ అరబిక్ వంటల పక్కన వేసుకుంటే సూపర్..
  కొంచం వేసుకోమ్మా పెద్ద నువ్వు నీ బెట్టూ ను..

 1. @ రవి: మరే... టాంక్ యూ టాంక్ యూ. కొంచం ముందుకు వెళ్ళి వంకాయ కూటు లు, అన్నం లో మసాలా బదులు మసాలాలో అన్నం వేసి చాలానే వున్నాయి చెపితే భయ పడ తారని చెప్పలే ఒక సాంపుల్ వదిలేను..

  @ సునీతా: టాంక్ యూ టాంక్ యూ.. మీ వంటల పక్కన ఏదో వుడతా భక్తి ..

  @ మాలా కుమార్ గారు: లేదబ్బా పచ్చడి మిగిలితే నేను మాత్రం తినొద్దూ.. పచ్చడి కదా ఎలా వున్నా పక్కన పెట్టుకుని తినేస్తారని ఇది ఇచ్చాను.

 1. @ కొత్త పాళి గారు: గుర్ర్.. గుర్ర్.. నేనొప్పుకోను.. నేనూ నెల కు ఒక్క సారి బోలెడంత వంట చేసి పెడతాను తెలుసా ఏమి ఆ ఈండియన్ రెస్టారెంట్ కంటే తీసి పోయానా వాడు నెల కొక సారి చేస్తాడు నేను అంతే... ;-)

  @ జయా: కదా... నువ్వు మంచి దానివి.. వీళ్ళందరు భయ పడుతున్నారు మా అమ్మ వు కదా దా ఇంకొంచం వేస్తాను..

 1. భావనా..అసలు అంతపెద్ద క్యాబేజీని అలాగే ఎలా ఉడికించావ్ తల్లి.. అడవిరాముడులో రాజబాబు టైపా..మనకూ పెళ్లయ్యేవరకు వంటరాదనుకో.కాని పేరడితో మాత్రం పచ్చడికి భలే తిరగమూత పెట్టావ్. కొత్తపాళీగారు భయపడ్డంలో తప్పులేదనిపిస్తుంది.

 1. నా తల్లే నా తల్లే! కాబేజీ తరక్కుండా ఉడకపెట్టావా బంగారు తల్లీ! నాకెంత మంచి ఫ్రెండువో! బెండకాయ వేపుడుని ప్లాస్టిక్ చెంచాతో కలుపుతూ , అది తీగలు సాగుతుంటే అవి బెండకాయ తాలూకు తీగలనుకున్నా! తీరా చెంచా షేపులు మారిపోయాక అర్థమైంది!

  సర్లే గానీ, ఇంతకీ "కొంచెం" అంటే ఎంత?

 1. voddulea bhaavanaa! pachchaDi anni saarlu tinTea kadupuloa manTa...kadaa...

 1. ఇప్పుడే వచ్చానండీ మన లోకంలోకి...ఒక్కొక్క వంటకం తింటు వస్తున్నా...ఇక్కడ పచ్చడి కన్నా పాట పవర్ఫుల్గా తోస్తోంది...
  బాగుంది మీ వంట గురించి మీరింకేం పోస్ట్ రాయక్కర్లేదు...అంతా అర్ధమైపోయింది... :) :)

 1. అబ్బ వూరుకో జ్యోతి మరీ వివరాలలోకి వెళతావు నాకు మాత్రం తెలుసా ఏమిటి అలా వుడక పెట్టకూడదని ఏనాడైనా చూస్తే కదా, వుడికేక తరిగితే తేలిక అవుతుందని బాగా బ్రైన్ వుపయోగించా.. అడవి రాముడు లో రాజ బాబు టైపు. హి హి హి నిజమే గుర్తు రాలా అందులో రాజబాబు సొరకాయ, బతికున్న కోడి వేస్తాడు కదు.. ఆ ఆల్మోస్ట్ అదే రేంజ్... నేను వండే వంట కొంతమంది (ఎక్కువ మంది కాదులే కుంచం మంది) బాగుంటుంది అంటారు అంటే మా అన్న ఇప్పటికి నమ్మడు ఏడిసేవు లే అని కొట్టిపారేస్తాడు. :-(
  నీకు ఎప్పుడైనా ఎవరి మీద ఐనా బాగా కోపం వస్తే నన్నో, మన సుజాతనో తీసుకెళ్ళి వంట చేయించెయ్యి దెబ్బ కు ఠా దొంగల ముఠా..
  ఏమ్మ ఇండియన్ హోటల్ వోడీ కంటే బానే చేస్తాను లేమ్మా.మా వూరేపుకు రాని కొత్త పాళి గారిని చూపిస్తా నా వంటల తఢాకా ఆయనే ఒక పోస్ట్ రాస్తారు నావంటల గురించి( ఏమని అనా ... ఆ ఒక్కటి అడగకు)

 1. @ సుజాత: టాంక్ యూ ..టాంక్ యూ.. హేమిటో మీ అందరు అభిమానం తో వుక్కిరి బిక్కిరి చేసేస్తున్నారోయ్.. అందరిని పిలిచి బోయనం పెట్టాల్సిందే.. మరి నీ ఫ్రెండు ను కాదు..
  నావి కూడా షేం టు షేం ;-) డైలాగులు.. నా తల్లి నా తల్లే ప్లాస్టిక్ స్పూనెట్టి తిప్పేవా పైగా బెండకాయ తాలూకు తీగలనుకున్నావా? నాకు వంట ల మీదే పెద్ద అవుడియా లేదనుకుంటే నీకు వంట కు సంబంధించిన నైసర్గిక స్వరూపాలు కూడా తెలియదు కదా. నాకు నువ్వు...... నీకు నేను మనకి వంట.. టాం ట టాయ్ ... టాం ట టాయ్...

 1. @ జయ :జయ భయ పడ్డావా ఏమ్మా నీ భోలా బాత్ రెండో సారి కూడా ప్లేట్ నిండా పెట్టించుకోలేదు.. అంతే లేమ్మా న్యాయం లేదు లోకం లో ఈ పాడు లోకం లో.. చూడు నేను విషాదం గా పాడుకుంటు పౌర్ణమి చంద్రుడు వైపు వెళ్ళి పోతున్నా..

 1. @తృష్ణ : "భయపడ్డావా? పచ్చడి మొహమాటం పెట్టి వేస్తానని భయ పడ్డావా.. హెయ్ హెయ్ భయపడ్డావు నిజం గా తినాల్సొస్తుందని భయపడ్డావు ఒప్పుకో నిజం ఒప్పుకో.." (గీతాంజలి లో గిరిజ లా చదువుకోండి) :-)
  అన్నం వుడికిందో లేదో ఒక మెతుకు చాలన్నట్లు నా ప్రతిభ ధగ ధగ లాడుతు కనపడుతుందా ఇంకో పోస్ట్ వద్దా.. హి హి హి మీ అభిమానం సరే ఐతే..

 1. పచ్చడి బావుంది.

 1. కూసంత టమోటా పచ్చడేయండి చాలు. మీ అన్నయ్య ముందే చెప్పి ఎంత మంచి పని చేసారో... అయినా ఎంత ఆకలేస్తే మాత్రం హోల్సేల్ క్యాబేజీ ని కుక్కర్ లో పెట్టడమే. ఇంతకు నీళ్ళన్నా పోసారా? లేకపొతే మళ్ళీ ఏంచడం ఎందుకని ఏకంగా నూనె పోసి వుడక పెట్టారా?

  ఎంత కుట్రండి. ఎర్రపూల కోడికూర విందని పిలిచి ఎర్ర కారం పెడతారా? హమ్మా !

 1. పచ్చడంటె తెలుసా నీకు
  తెలియందె ప్రయత్నించకూఊఊఊఊఊఊఊఊఊఊ
  ఖంగారుపడకండి. మీరు ముందు రాసిన ఉపోద్ఘాతం చదివి ఏమో అనుకున్నా.. బాగానే చేసారు.

 1. భావన గారు, ఆహా బ్రహ్మాండం.. అంత పెద్ద క్యాబేజి ని అమాంతం కుక్కర్ లో ఇరికించేసి ఉడికించేసిన మీ చాకచక్యాన్ని గుర్తించకుండా వీళ్ళంతా ఈ కామెంట్లేంటి... వీళ్ళంతా అలానే అంటారు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. మీరు కేక అంటే కేక అంతే :-)

  మీ అన్నయ్య గారి పేరడీ.. మీ కొసమెరుపు రెండూ అదిరాయి. వాటికన్నా ఇది టమాటా చట్నీ అని గుర్తించేలా ఫోటోలో రెండు టమాటా ముక్కలు పెట్టారు చూశారూ మీ ప్రెజెంటేషన్ సమయస్ఫూర్తికి జోహార్ :-)

 1. అసలేం జరిగిందంటే, మీరీ మధ్య నా బ్లాగ్ కి రావట్లేదు కదా? అసలు మీరు ఎక్కడున్నారు ఏంటి సంగతి అని మీ బ్లాగ్ కి వచ్చా. మీరేమో పచ్చళ్ళ తో బిజీ గా ఉన్నారన్నమాట. వాకే. ఇప్పుడే ఇలా ఉంటే, ఆవకాయ సీజన్లో మిమ్మల్ని కలవటం కష్టమే.

 1. అవునండీ ఒక గిన్నెలో అన్నం పెట్టానన్నారూ, ఇంకో గిన్నెలో పప్పు పెట్టానన్నారూ..మరి అంత లావు కాబేజీ పై గిన్నెలో ఎలా పట్టిందండీ...????

 1. నెల తరువాత సమాధానం ఇస్తున్నానని కోపం పెట్టుకోకండోయ్ అందరు.

  సూర్య లక్ష్మి గారు. ధన్యవాదాలండి బాగుంది అన్నందుకు.

  భా. రా.రే: పూల కోడి సంక్రాంతి కి, ఇలా వన భోజనాలకు అడగ కూడదు తప్పు లెంపలేసుకో. :-)

 1. శ్రీ లలిత: నేను అలానే పాడుకుంటానండి వంట చేసినప్పుడల్లా. హి హి హి ఎన్ని సవత్సరాలైనా వంట వంట బట్టి చావటమ్ లేదండి అదేమిటో.

  వేణు శ్రీకాంత్: పోనిలే మీరైనా అర్ధం చేసుకున్నారు నా చాక చక్యం. అమ్మయ్య. నేను ఏది వండినా అంతే హి హి హి పక్కన అసలు వాడిన కూరగాయ పెట్టక పోతే అది అదే అని గుర్తు పట్టటం కష్టం. ;-)

 1. కిరణ్మయి: ఏమిటి నాతో ఆవకాయ పట్టించేసుకుందామనే నీ బ్యాడ్లక్ వచ్చేయి మరి పట్టి ఇచ్చేస్తా... ఆ పైనా భగవంతుడున్నాడు.
  ప్రణీత స్వాతి: ఆ పెద్ద కుక్కర్ లో పట్టేసింది అండి. ఇప్పుడు మీరు ఎంత పెద్ద అంటే కష్టం మరి చెప్పటమ్. పేద్దది అంత వరకు ఖచ్చితం.